Visakhapatnam: వైకాపా సమావేశం.. రహదారి మూసివేత

వైకాపా ఆధ్వర్యంలో విశాఖ నగరం మాధవధార వుడా కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పేరిట అనుమతులు లేకుండా ప్రధాన రహదారి మధ్యలో సభావేదిక ఏర్పాటు చేశారు.

Updated : 05 Mar 2024 08:34 IST

విశాఖపట్నం (మాధవధార), న్యూస్‌టుడే: వైకాపా ఆధ్వర్యంలో విశాఖ నగరం మాధవధార వుడా కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల పేరిట అనుమతులు లేకుండా ప్రధాన రహదారి మధ్యలో సభావేదిక ఏర్పాటు చేశారు. వైకాపా పెద్దలు సభకు వస్తున్నారని ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. వుడా కాలనీ వరకు వచ్చే ఆర్టీసీ బస్సులను రెండు కిలోమీటర్ల ముందు మాధవధార వద్ద నిలిపివేయించి, అక్కడ నుంచి వెనక్కి మళ్లించారు. సాయంత్రం 5 గంటలకు సభ అయితే.. ఉదయం 10 గంటల నుంచే రహదారిని మూసివేసి, బస్సులను నిలిపివేయించడంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. చుట్టుపక్కల పలు కాలనీలకు వెళ్లే ప్రధాన రహదారి కావడంతో, వారంతా వేరే మార్గం నుంచి రాకపోకలు సాగించారు. రహదారిని మూసివేయడాన్ని స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని