Omicron:రెట్టింపు వేగం

రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 41,954 నమూనాలు పరీక్షించగా 3,205మందికి వైరస్‌ నిర్ధారణైంది. పాజిటివిటీ రేటు 7.63%గా నమోదైంది. జనవరి 1న 0.57%గా ఉన్న      పాజిటివిటీ రేటు మంగళవారం 5.02 శాతానికి   ఎగబాకింది. బుధవారానికి మరో 2.6% పెరగడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా కేసులను బట్టి అత్యధికంగా విశాఖ జిల్లాలో పాజిటివిటీ రేటు...

Updated : 13 Jan 2022 04:18 IST

ఒక్క రోజులో 1,831 నుంచి 3,205కు చేరిన కేసులు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో కొవిడ్‌ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 41,954 నమూనాలు పరీక్షించగా 3,205మందికి వైరస్‌ నిర్ధారణైంది. పాజిటివిటీ రేటు 7.63%గా నమోదైంది. జనవరి 1న 0.57%గా ఉన్న      పాజిటివిటీ రేటు మంగళవారం 5.02 శాతానికి   ఎగబాకింది. బుధవారానికి మరో 2.6% పెరగడం వ్యాధి తీవ్రతను తెలియజేస్తోంది. తాజా కేసులను బట్టి అత్యధికంగా విశాఖ జిల్లాలో పాజిటివిటీ రేటు 19.42% (695 కేసులు) నమోదు కాగా, చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లోనూ 10% దాటింది. విశాఖ నగరంలో వ్యాధి ఉద్ధృతి తీవ్రంగా ఉంది. యాత్రికుల రాకపోకలు, ప్రభుత్వ కార్యక్రమాలు, సరిహద్దు రాష్ట్రాల నుంచి తాకిడి కారణంగా చిత్తూరు జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. కొవిడ్‌ బాధితుల్లో అత్యధికులు ఇళ్లల్లోనే ఉంటూ చికిత్స పొందుతున్నారు.

ప్రపంచంలో..
కొత్తగా 27 లక్షల మందికి..
అమెరికాలో కొనసాగుతున్న ఒమిక్రాన్‌ ఉప్పెన
నిత్యావసర సరకులకూ కొరత!
దేశంలో..
2 లక్షలకు చేరువలో కొత్త కేసుల నమోదు
మహమ్మారి కారణంగా మరో 442 మంది మృతి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని