BSNL Recharge: బీఎస్‌ఎన్‌ఎల్‌ బంపర్‌ ఆఫర్‌.. రూ.599తో అన్‌లిమిటెడ్‌ డేటా!

తక్కువ ధరలోనే ఎక్కువ డేటాతో పాటు కొన్ని దీర్ఘకాల ప్లాన్‌లను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చింది.

Published : 26 Dec 2021 17:48 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల ప్రైవేటు టెలికాం సంస్థలు టారిఫ్‌ ఛార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో వినియోగదారులకు ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ పలు ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించింది. తక్కువ ధరలోనే ఎక్కువ డేటాతో పాటు కొన్ని దీర్ఘకాల ప్లాన్‌లను తీసుకొచ్చింది.

అన్ని ప్లాన్లలోకెల్లా రూ.599 అందరినీ ఆకర్షిస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకున్నవారికి ప్రతిరోజు 5 జీబీ డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు అందుతాయి. వీటితో పాటు జింగ్‌మ్యూజిక్‌ను ఉచితంగా ఆనందించవచ్చు. ఇక అర్ధరాత్రి 12 గంటల నుంచి ఉదయం ఐదింటి వరకు అన్‌లిమిటెడ్‌ డేటా అందిస్తోంది. ఇన్ని ఆఫర్లు ఉన్న ప్లాన్‌ కాలపరిమితి ఏ 28 రోజులో, 36 రోజులో అనుకుంటే పొరపాటే. 84ల రోజు వ్యాలిడిటీతో ఇవన్నీ అందనున్నాయి. ఈ ధరలో ఈ స్థాయి ఫీచర్లు ఉన్న ప్లాన్ మరే టెలికాం సంస్థ అందించడం లేదనే చెప్పాలి.

ఇక దీర్ఘకాల ప్లాన్ల వివరాలు ఇలా ఉన్నాయి...

* రూ.2,399; కాలపరిమితి- 425 రోజులు; వాయిస్‌ కాల్స్‌- అపరిమితం; డేటా- రోజూ 3జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజూ 100; ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌

* రూ.1,999; కాలపరిమితి- 365 రోజులు; వాయిస్‌ కాల్స్‌- అపరిమితం; డేటా- 600 జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100; ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, 60 రోజుల వరకు వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌, ఈరోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్‌

* రూ.1,999; కాలపరిమితి- 180 రోజులు; వాయిస్‌ కాల్స్‌- అపరిమితం; డేటా- రోజూ 3 జీబీ; ఎస్‌ఎంఎస్‌లు- రోజుకు 100; 60 రోజుల వరకు ఉచిత బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సబ్‌స్క్రిప్షన్

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని