డిజిటల్ ఖాతాలతో పొదుపు సుల‌భం.. సుర‌క్షితం..

ఇదివ‌ర‌కు బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించాలంటే బ్యాంకుకు వెళ్లి వ‌రుస‌లో నిల‌బ‌డి చాలా స‌మ‌యం వేచి చూడాల్సి వ‌చ్చేది. కాని ఇప్పుడు డిజిట‌ల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు క్ష‌ణాల్లో ఖాతాను ప్రారంభించ‌వచ్చు. దీంతో ఎలాంటి శ్ర‌మ అవ‌స‌రం లేకుండా స‌మ‌యం వృథా చేసుకోకుండా ప‌ని అయిపోతుంది...

Published : 16 Dec 2020 21:05 IST

ఇదివ‌ర‌కు బ్యాంకులో పొదుపు ఖాతా ప్రారంభించాలంటే బ్యాంకుకు వెళ్లి వ‌రుస‌లో నిల‌బ‌డి చాలా స‌మ‌యం వేచి చూడాల్సి వ‌చ్చేది. కాని ఇప్పుడు డిజిట‌ల్ యుగంలో చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు క్ష‌ణాల్లో ఖాతాను ప్రారంభించ‌వచ్చు. దీంతో ఎలాంటి శ్ర‌మ అవ‌స‌రం లేకుండా స‌మ‌యం వృథా చేసుకోకుండా ప‌ని అయిపోతుంది. ఆన్‌లైన్‌లో బ్యాంకు వెబ్‌సైట్ లేదా స్మార్ట్ ఫోన్‌లో మొబైల్ యాప్ ద్వారా డిజిట‌ల్ పొదుపు ఖాతాను ప్రారంభించే స‌దుపాయ‌న్ని ఇప్పుడు కొన్ని బ్యాంకులు క‌ల్పిస్తున్నాయి. మీరు డిజిట‌ల్ పొదుపు ఖాతాను ప్రారంభించాల‌నే ఆలోచ‌న‌తో ఉంటే ఈ 5 డిజిట‌ల్ ఖాతాల‌ను ప‌రిశీలించండి. సుల‌భంగా, క్ష‌ణాల్లో మంచి వ‌డ్డీ రేట్లు, రివార్డులు, డాక్యుమెంట్ల‌తో ప‌నిలేకుండా ప్రారంభించే ఆ ఖాతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం…

  1. డిబీఎస్ డిజిబ్యాంక్ (Digibank by DBS)

డిజిబ్యాంక్ అనేది డిజిట‌ల్ బ్యాంక్‌. డిజిబ్యాంక్ ద్వారా పొదుపు ఖాతాను ప్రారంభించ‌డం చాలా సుల‌భం. దీనిక ఎలాంటి పేప‌ర్ వ‌ర్క్ అవ‌స‌రం లేదు. మీ వివ‌రాలు ఓటీపీ ద్వారా వెరిఫై చేసుకొని ఖాతాను క్ష‌ణాల్లో ప్రారంభించ‌వ‌చ్చు. దీనికోసం మీ వ‌ద్ద కేవ‌లం ఒక స్మార్ట్‌ఫోన్ అందులో డిజిబ్యాంక్ యాప్ ఉంటే చాలు. డిజిబ్యాంక్ డిజిట‌ల్ పొదుపు ఖాతా ముఖ్య‌మైన ఫీచ‌ర్లు…

  • డిజిబ్యాంక్ జీరో బ్యాలెన్స్ పొదుపు ఖాతా
  • పొదుపుపై వ‌డ్డీ రేటు 7 శాతం
  • డిజిసేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై డెబిట్ కార్డు ల‌భిస్తుంది. ఇది ఎక్క‌డైనా ఉప‌యోగించ‌వ‌చ్చు.
  • డిజిబ్యాంక్ యూపీఐతో ఇత‌ర ఖాతాల‌కు క‌డా లావాదేవీలు చేయ‌వచ్చు.
  • ఈ ఖాతాతో క్యాష్‌బ్యాక్ ఆఫ‌ర్లు, డిస్కౌంట్లు వంటివి ల‌భిస్తాయి.
  • దీంతో పాటు బ‌డ్జెట్ ఆప్టిమైజ‌ర్ కూడా ఆఫ‌ర్ చేస్తుంది. దీంతో మీ ఖ‌ర్చుల‌ను సుల‌భంగా లెక్కించుకోవ‌చ్చు.
  • మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులను కూడా ఈ ఖాతాతో చేయ‌వ‌చ్చు

 కోట‌క్ 811 ఎడ్జ్ (Kotak 811 Edge)

కోట‌క్ 811 ఎడ్జ్ డిజిట‌ల్ పొదుపు ఖాతాలో మ‌రో మైలురాయి. కోట‌క్ 811 చాలా సుల‌భంగా ఉప‌యోగించే డిజిట‌ల్ పొదుపు ఖాతా. కోట‌క్ వెబ్‌సైట్ లేదా యాప్ లేదా ద‌గ్గ‌ర‌లోని బ్యాంకు శాఖకు వెళ్లి ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. దీంతో మొత్తం డిజిట‌ల్ రూపంలో లావాదేవీలు చేసుకోవ‌చ్చు. ఎలాంటి శ్ర‌మ‌, స‌మ‌యం వృథా అవ‌స‌రంల లేదు. కోట‌క్ 811 ముఖ్య‌మైన ఫీచ‌ర్లు…

  • నెల‌వారిగా స‌గ‌టుగా బ్యాలెన్స్ క‌చ్చితంగా రూ.10 వేలు ఖాతాలో ఉండాలి.
  • ఈ ఖాతాలో పొదుపుపై వ‌డ్డీ రేటు 6 శాతం
  • ప్లాటినం డెబిట్ కార్డు ల‌భిస్తుంది. దీనికి సంవత్స‌రానికి ఫీజు రూ.150.
  • ఐఎమ్‌పీఎస్, నెఫ్ట్, ఆర్‌టీజీఎస్ వంటి ఆన్‌లైన్ లావాదేవీలు ఉచితం
  • చెక్ బుక్ స‌దుపాయం ఉంది.
  • మొబైల్ ద్వారా లేదా బ్యాంకు శాఖ‌ను సంప్ర‌దించి ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు
  1. ఎస్‌బీఐ డిజిటల్‌ అండ్ ఇన్‌స్టా సేవింగ్ ఖాతా (SBI Digital and Insta Saving Account)

ఎస్‌బీఐ అందించే ఎస్‌బీఐ ఇన్‌స్టా ఖాతాను క్ష‌ణాల్లో స్మార్ట్‌ఫోన్ ద్వారా ప్రారంభించ‌వ‌చ్చు. కేవ‌లం భార‌త పౌరులు మాత్ర‌మే ఈ ఖాతాను ప్రారంభించే అవ‌కాశం ఉంటుంది. 18 సంవ‌త్స‌రాల కంటే ఎక్కువ వ‌య‌సుండాలి. ఇన్‌స్టా ఖాతాను యోన్ యాప్ లేదా యోన్ ఎస్‌బీఐ పోర్ట‌ల్ ద్వారా తెర‌వ‌వ‌చ్చు. ఎస్‌బీఐ డిజిట‌ల్ ఇన్‌స్టా ఖాతా ముఖ్య‌మైన ఫీచ‌ర్లు…

  • పేప‌ర్‌తో ప‌ని లేకుండా పూర్తిగి డిజిట‌ల్ రూపంలో ఈ-కేవైసీ ఆధారిత ఓటీపీ ద్వారా ప్రారంభించ‌వ‌చ్చు
  • ఇందులో మార్చి 31,1019 వ‌ర‌కు ఎటువంటి క‌నీస బ్యాలెన్స్ ఉండ‌న‌వ‌స‌రం లేదు
  • ఖాతాదారుడికి ఉచితంగా రూపే డెబిట్ కార్డును అందిస్తారు
  • ఈ ఖాతాలో గరిష్ఠంగా ల‌క్ష రూపాయ‌ల వ‌ర‌కు బ్యాలెన్స్ ఉండ‌వ‌చ్చు
  • పాస్ బుక్‌, చెక్‌బుక్ స‌దుపాయం ఉండ‌దు
  1. పెడ‌ర‌ల్ బ్యాంక్ ఫెడ్‌బుక్ సెల్ఫీ ఖాతా (Federal Bank Fedbook Selfie Account)

ఫెడ‌ర‌ల్ బ్యాంక్ ఫెడ్‌బుక్ సెల్ఫీ ఖాతాను సుల‌భంగా ప్రారంభించ‌వ‌చ్చు. ఖాతా ప్రారంభించేందుకు మీరు సెల్ఫీ తీసుకోవాలి. ఫెడ్‌బ్యాంక్ సెల్ఫీ యాప్ ద్వారా ఈ ఖాతాను తెర‌వాలి. దీనికోసం ఒక‌సారి బ్యాంకును సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఆన్‌లైల్‌లో కేవైసి పూర్తి చేయాలి. ఇది జీరో-బ్యాలెన్స్ ఖాతా. ముఖ్య‌మైన ఫీచ‌ర్లు…

  • క్ష‌ణాల్లో ఖాతా ప్రారంభం, ఖాతా నంబ‌ర్ ల‌భిస్తుంది
  • జీరో బ్యాలెన్స్ ఖాతా
    *ఖాతాదారుడికి రూపే క్లాసిక్ డెబిట్ కార్డు ఇస్తారు. దీనికి వార్షికంగా కొంత ఛార్జీలు వ‌ర్తిస్తాయి.
  • ప‌రిమిత చెక్‌ల‌తో కూడిన చెక్ బుక్ స‌దుపాయం ఉంటుంది.
  • నెల‌స‌రి స‌గ‌టు బ్యాలెన్స్ అవ‌స‌రం లేదు. లావాదేవీల ఛార్జీలు ఉండవు
  1. యాక్సిస్ బ్యాంక్ ఏఎస్ఏపీ ఆన్‌లైన్ పొదుపు ఖాతా (Axis Bank ASAP Online Saving Account)

డిజిట‌ల్ పొదుపు ఖాతా కోసం యాక్సిస్ బ్యాంక్ ఏఎస్ఏపీ ఖాతా మ‌రో మంచి ఆప్ష‌న్ అని చెప్పుకోవ‌చ్చు. యాక్సిస్ మొబైల్ యాప్‌న డౌన్‌లోడ్ చేసుకొని లేదా యాక్సిస్ బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఖాతాను ప్రారంభించ‌వ‌చ్చు. ఇది జీరో బ్యాలెన్స్ ఖాతా. రూ.10 వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉంటే ఎక్కువ వ‌డ్డీని అందిస్తుంది. యాక్సిస్ ఏఎస్ఏసీ ఖాతా ముఖ్య‌మైన ఫీచ‌ర్లు…

  • ఇది జీరో బ్యాలెన్స్ ఆన్‌లైన్ పొదుపు ఖాతా. యాక్సిస్ మొబైల్ యాప్ ద్వారా ప్రారంభించ‌వ‌చ్చు
  • వ‌ర్చువ‌ల్ డెబిట్ కార్డు స‌దుపాయం ల‌భిస్తుంది
  • ఇందులో రూ.10 వేల కంటే ఎక్కువ ఉంటే ఆటో స్వీప్ ఫ్లెక్సీ ఎఫ్‌డీ స‌దుపాయాన్ని క్రియేట్ చేసుకోవ‌చ్చు
  • ఆన్‌లైన్ షాపింగ్‌పై మంచి ఆఫ‌ర్లు ల‌భిస్తాయి.
  • వార్షిక ఛార్జీల‌తో కూడిన‌ డెబిట్ కార్డు స‌దుపాయం ఉంటుంది
  • నెఫ్ట్, ఐఎమ్‌పీఎస్‌, ఆర్‌టీజీఎస్ వంటి ఆన్‌లైన్ దేవీలు ఉచితం.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని