Electrical equipment: 2025 నాటికి 72 బి.డాలర్లకు ఎలక్ట్రికల్‌ ఉపకరణాల రంగం!

ఎలక్ట్రికల్‌ ఉపకరణాల మార్కెట్‌ ఏటా 12 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి.....

Published : 19 Sep 2021 21:19 IST

దిల్లీ: ఎలక్ట్రికల్‌ ఉపకరణాల మార్కెట్‌ ఏటా 12 శాతం వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం 48-50 బిలియన్‌ డాలర్లుగా ఉన్న ఈ మార్కెట్‌ విలువ 2025 నాటికి 72 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని ‘ఇండియన్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌ అసోసియేషన్‌(ఐఈఈఎంఏ)’ అధ్యక్షుడు అనిల్‌ సాబూ అంచనా వేశారు. ప్రస్తుతం 8.62 బిలియన్‌ డాలర్లు విలువ చేసే వస్తువులను ఎగుమతి చేస్తున్నామని.. వచ్చే కొన్నేళ్లలో ఇది 13 బిలియన్ డాలర్లకు చేరుతుందన్నారు. 

పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను చేరుకోవడంలో ఎలక్ట్రికల్‌ రంగం కీలక పాత్ర పోషించనుందని అనిల్‌  అన్నారు. 2022 నాటి 175 గిగావాట్స్, 2030 నాటికి 450 గిగావాట్స్‌ పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించాలని భారత్‌ లక్ష్యంగా పెట్టుకున్న విషయం తెలిసిందే. ఇందుకు అత్యాధునిక పరికరాలు అవసరముంటాయని.. వాటిని తయారు చేసేందుకు దేశీయ ఎలక్ట్రికల్‌ పరిశ్రమ సిద్ధంగా ఉందన్నారు. ఈ రంగంలోకి ఏటా 18 బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని