వాహన లీజింగ్‌లోకి మహీంద్రా ఫైనాన్స్‌

వాహన లీజింగ్‌, సబ్‌స్క్రిప్షన్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ‘క్విక్‌లిజ్‌’ బ్రాండ్‌ పేరుతో కొత్త వ్యాపార...

Published : 17 Sep 2021 01:30 IST

ముంబయి: వాహన లీజింగ్‌, సబ్‌స్క్రిప్షన్‌ వ్యాపారంలోకి అడుగుపెడుతున్నట్లు మహీంద్రా గ్రూప్‌ సంస్థ మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ప్రకటించింది. ‘క్విక్‌లిజ్‌’ బ్రాండ్‌ పేరుతో కొత్త వ్యాపార విభాగాన్ని నిర్వహించనున్నట్లు తెలిపింది.  సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఉత్పత్తుల విడుదలకు బ్రాండ్‌ ఉపకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

కోటక్‌ చేతికి ఫోక్స్‌వ్యాగన్‌ ఫైనాన్స్‌ వాహన రుణ వ్యాపారం

జర్మనీ కార్ల సంస్థ ఫోక్స్‌వ్యాగన్‌కు చెందిన వాహన రుణ వ్యాపారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ వెల్లడించింది. కొనుగోలు మొత్తాన్ని సంస్థ ప్రకటించలేదు. ఫోక్స్‌వ్యాగన్‌ ఫైనాన్స్‌ నుంచి ప్రయాణికుల కార్లు, ద్విచక్రవాహన పోర్ట్‌ఫోలియోను కోటక్‌ మహీంద్రా ప్రైమ్‌ కొనుగోలు చేస్తుండగా, వాణిజ్య వాహన పోర్ట్‌ఫోలియోను కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ సొంతం చేసుకోనుంది.


పారస్‌ డిఫెన్స్‌ ఐపీఓ 21 నుంచి
ధరల శ్రేణి రూ.165- 175

దిల్లీ: పారస్‌ డిఫెన్స్‌ అండ్‌ స్పేస్‌ టెక్నాలజీస్‌ తొలి పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీఓ)సెప్టెంబరు 21న మొదలై 23న ముగియనుంది. ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.165- 175ను నిర్ణయించారు. పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా రూ.140.60 కోట్ల విలువైన తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో (ఓఎఫ్‌ఎస్‌) ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదార్లు 17,24,490 షేర్లను విక్రయించనున్నారు. ధరల శ్రేణిలోని గరిష్ఠమైన రూ.175తో లెక్కిస్తే.. ప్రతిపాదిత ఇష్యూ ద్వారా రూ.170.70 కోట్ల నిధులను కంపెనీ సమీకరించే అవకాశం ఉంది. ఈ నిధులను మూలధన వ్యయాల అవసరాలు, రుణాల చెల్లింపునకు కంపెనీ వినియోగించనుంది. ఇష్యూలో సగం షేర్లను అర్హులైన సంస్థాగత మదుపర్లకు, 35 శాతాన్ని చిన్న మదుపర్లకు, 15 శాతాన్ని సంస్థాగతేదర మదుపర్లకు కేటాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని