IPO: మ్యాప్‌మైఇండియా ఐపీవో ప్రారంభం..!

దేశంలోని డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ ‘మ్యాప్‌మైఇండియా’ ఐపీవో నేడు మొదలైంది. ఈ కంపెనీ షేర్లు ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,000 నుంచి 1,033 మధ్య ఉంది. మొత్తం రూ.1,039.6 కోట్లు సమీకరించేందుకు

Published : 09 Dec 2021 17:27 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశంలోని డిజిటల్‌ మ్యాపింగ్‌ కంపెనీ ‘మ్యాప్‌మైఇండియా’ ఐపీవో నేడు మొదలైంది. ఈ కంపెనీ షేర్లు ప్రైస్‌బ్యాండ్‌ రూ.1,000 నుంచి 1,033 మధ్య ఉంది. మొత్తం రూ.1,039.6 కోట్లు సమీకరించేందుకు ఈ ఐపీవో వచ్చింది. డిసెంబర్‌ 13వ తేదీ వరకు బిడ్లను స్వీకరిస్తారు. ఫెడిలిటీ, నోమోరా, గోల్డ్‌మన్‌ సాక్స్‌, మోర్గాన్‌ స్టాన్లీ, ఎబర్డీన్‌, హెచ్‌ఎస్‌బీసీ సంస్థలు షేర్ల కేటాయింపులో సహయకులుగా వ్యవహరించనున్నాయి. యాక్సెస్‌ క్యాపిటల్‌, జేఎం ఫైనాన్షియల్‌, కొటాక్‌ మహీంద్రా క్యాపిటల్‌, డీఎం క్యాపిటల్‌ అడ్వైజరీస్‌ లీడ్‌ మేనేజర్లుగా వ్యవహరించనున్నాయి.

ఈ ఐపీవోకు సంబంధించి షేర్లను డిసెంబర్‌ 16వ తేదీ నాటికి కేటాయించవచ్చు. ఇక కంపెనీషేర్లు డిసెంబర్‌ 21వ తేదీన స్టాక్‌ మార్కెట్‌లో లిస్ట్‌ కానున్నాయి. ఈ ఐపీవోకు బిడ్లు దాఖలు చేసేవారు కనీసం 14 షేర్లు తీసుకోవాలి. అందుకు కనీసం రూ.14,462 వెచ్చించాల్సి ఉంటుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు అత్యధికంగా 13 లాట్ల వరకు షేర్ల కోసం బిడ్లు దాఖలు చేయవచ్చు.  ఇప్పటికే కంపెనీ యాంకర్‌ ఇన్వెస్టర్లకు 30.19 లక్షల షేర్లను కేటాయించి రూ.312 కోట్లను సమీకరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని