పెద్దల డిపాజిట్ ఖాతాలు

60 ఏళ్లు ఆ పై ఉన్నవారు పదవీ విరమణ చేసి ఉంటారు కాబట్టి వారి ఆదాయ వనరులు సైతం క్రమంగా తగ్గుతూ వస్తాయి. పెద్దల పదవీ విరమణ తర్వాతి ఆదాయ వనరులకు అదనపు వడ్డీని అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకమైన డిపాజిట్ల వడ్డీ రేట్లను కాస్త ఎక్కువగానే నిర్ణయించింది. దాదాపు అన్ని బ్యాంకులు సాధారణం కంటే 0.5శాతం అదనపు వడ్డీని సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లపై ఇస్తున్నాయి..

Updated : 02 Jan 2021 20:02 IST

60 ఏళ్లు ఆ పై ఉన్నవారు పదవీ విరమణ చేసి ఉంటారు కాబట్టి వారి ఆదాయ వనరులు సైతం క్రమంగా తగ్గుతూ వస్తాయి. పెద్దల పదవీ విరమణ తర్వాతి ఆదాయ వనరులకు అదనపు వడ్డీని అందించే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ రకమైన డిపాజిట్ల వడ్డీ రేట్లను కాస్త ఎక్కువగానే నిర్ణయించింది.

దాదాపు అన్ని బ్యాంకులు సాధారణం కంటే 0.5శాతం అదనపు వడ్డీని సీనియర్‌ సిటిజన్స్‌ డిపాజిట్లపై ఇస్తున్నాయి.

పెద్దల డిపాజిట్ ఖాతా లక్షణాలు

  • సీనియర్‌ సిటిజన్స్‌ ఎంపికచేసుకునే పెట్టుబడి పథకాన్ని బట్టి కనీస మొత్తం డిపాజిట్‌ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తున్నాయి.

  • 15రోజులు మొదలుకొని 120 నెలల కాలపరిమితితో డిపాజిట్లు చేసుకునే వెసులుబాటు ఉంది.

  • మెచ్యూరిటీ సమయం గడవక ముందే సొమ్ము విత్‌డ్రా చేసుకునే అవకాశాన్ని ఆయా బ్యాంకుల నియమనిబంధనలను అనుసరించి, తగ్గింపు వడ్డీతో అందిస్తున్నాయి.

  • ఈ డిపాజిట్లపై రుణాలను పొందే అవకాశం ఉంటుంది.

సీనియర్ సిటిజన్స్ డిపాజిట్ ప్రత్యేక సదుపాయాలు…

  • 70ఏళ్లు దాటిన సీనియర్‌ సిటిజన్స్‌ తమ ఖాతాలో కనీస నిల్వ ఉంచుకోవాలనే నియమమేమీ లేదు.

  • సాధారణ రేట్ల కంటే 20శాతం తక్కువగా సేవా ఛార్జీలను వసూలు చేస్తారు. (డీడీ లాంటి ప్రాథమిక సేవలకు మాత్రమే)

  • బ్యాంకులు ఇచ్చే రాయితీలు పెద్దగా ప్రభావం చూపించకపోవచ్చు. అయితే దీర్ఘకాలంపాటు పెట్టుబడులు పెట్టేవారి కోసం ఈ రాయితీలకు తోడయ్యే చక్రవడ్డీ మాత్రం పెద్ద ప్రయోజనాలనే చేకూర్చుతుందనడంలో సందేహం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని