స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి.

Published : 06 May 2021 09:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాల్లో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఉదయం 9.23 సమయంలో సెన్సెక్స్‌ 58 పాయింట్ల లాభంతో 48,737 వద్ద నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 14,650 వద్ద కొనసాగుతున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌, హికాల్‌ లిమిటెడ్‌, ఐసీఆర్‌ఏ, మయూర్‌ యూనికోటర్స్‌, బాలాజీ టెలిఫిల్మ్‌, బ్యాంక్‌ ఆఫ్ మహారాష్ట్ర, మాగ్మా ఫిన్‌కార్ప్‌ లాభాల్లో ఉండగా.. మార్ఫీన్‌ ల్యాబ్స్‌, ఈఐడీ పార్రీ, కామ హోల్డింగ్స్‌, ఆగ్రోటెక్‌ ఫుడ్‌, ఫ్యూచర్‌ లైఫ్‌ స్టైల్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. 

ప్రధాన రంగ సూచీలు మొత్తం లాభాల్లోనే ట్రేడవుతుండటం విశేషం. డాలర్‌తో రూపాయి మారకం విలువ స్వల్పంగా పెరిగి రూ.74.06 వద్ద ట్రేడవుతోంది. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.109 పెరిగి  రూ.46980 వద్ద, కిలో వెండి ధర రూ.19 తగ్గి రూ. 69,630 వద్ద కొనసాగుతోంది. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని