Tamilnad Mercantile Bank IPO: ఐపీఓకి తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ దరఖాస్తు

తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగ బ్యాంకు తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు కావాల్సిన పత్రాలను సోమవారం సెబీకి సమర్పించింది. 15,827,495 తాజా షేర్లు, 12,505 ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది...

Updated : 06 Sep 2021 16:50 IST

దిల్లీ: తూత్తుకుడి కేంద్రంగా పనిచేస్తున్న ప్రైవేటు రంగ బ్యాంకు తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ ఐపీఓకి దరఖాస్తు చేసుకుంది. ఈ మేరకు కావాల్సిన పత్రాలను సోమవారం సెబీకి సమర్పించింది. 15,827,495 తాజా షేర్లు, 12,505 ఈక్విటీ షేర్లను విక్రయానికి ఉంచనుంది. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధుల్ని భవిష్యత్తులో సంస్థ కార్యకలాపాల్ని మరింత విస్తరించేందుకు ఉపయోగిస్తామని తెలిపింది.

భారత్‌లో  ప్రాచీన ప్రైవేటు బ్యాంకుల్లో తమిళనాడు మర్కంటైల్‌ బ్యాంక్‌ ఒకటి. దీనికి దాదాపు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వ్యవసాయ, రిటైల్‌ రుణాలు అందించడంలో పేరుగాంచింది. జూన్‌ 30, 2021 నాటికి బ్యాంకుకు 509 బ్రాంచిలు ఉన్నాయి. వీటిలో గ్రామీణ ప్రాంతాల్లో 106 శాఖలు, సెమీ-అర్బన్‌ ప్రాంతాల్లో 247, పట్టణ ప్రాంతాల్లో 80, మెట్రోపాలిటన్‌ ప్రాంతాల్లో 76 శాఖలు ఉన్నాయి. మొత్తం 40.93 లక్షల కస్టమర్లు ఉన్నారు. వీరిలో 70 శాతం మందికి బ్యాంకుతో ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అనుబంధం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని