Stock market: నష్టాల్లో ట్రేడవుతున్న మార్కెట్‌ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి....

Updated : 15 Dec 2021 09:37 IST

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. కాసేపటికే అమ్మకాల ఒత్తిడితో నష్టాల్లోకి జారుకున్నాయి. కొత్త కరోనా వేరియంట్‌ ఒమిక్రాన్‌ వ్యాప్తితో మదుపర్ల కొంత అప్రమత్తమయ్యారు. మరోవైపు అమెరికాలో ఫెడ్‌ సమావేశం నిర్ణయాలపై మదుపర్లు దృష్టి సారించారు. ఎఫ్‌ఐఐల విక్రయాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక ఇటీవల మార్కెట్‌లో లిస్టయిన పలు ఇంటర్నెట్‌ ఆధారిత కంపెనీల షేర్లు ప్రతికూలంగా ట్రేడవడం కూడా సూచీలపై ప్రభావం చూపుతోంది. 52 వారాల గరిష్ఠాల నుంచి పేటీఎం 23%, జొమాటో 16%, పీబీ ఫిన్‌టెక్‌ 22%, నైకా 43% నష్టపోయాయి. నేడు ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అమెరికా మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సూచీలు నేడు అప్రమత్తంగా కదలాడుతున్నాయి.

ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్‌ 169 పాయింట్ల నష్టంతో 57,947 వద్ద.. నిఫ్టీ 53 పాయింట్లు నష్టపోయి 17,271 వద్ద ట్రేడవుతున్నాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.76.04 వద్ద కొనసాగుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, ఎన్‌టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, మారుతీ, ఎల్‌అండ్‌టీ, బజాజ్‌ ఆటో కంపెనీల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. బజాజ్‌ ఫైనాన్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టీసీఎస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాలు చవిచూస్తున్నాయి.

Read latest Business News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని