Volkswagen Taigun: భారత మార్కెట్‌లోకి ఫోక్స్‌వాగన్‌ టైగన్‌..!

భారత మార్కెట్లోకి ఫోక్స్‌వేగన్‌ టైగన్‌ అడుగుపెట్టింది. వేరియంట్‌ను బట్టి ఈ ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.10.49 లక్షల నుంచి 17.49 లక్షల వరకు ఉంది.

Published : 23 Sep 2021 17:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత మార్కెట్లోకి ఫోక్స్‌వేగన్‌ టైగన్‌ అడుగుపెట్టింది. వేరియంట్‌ను బట్టి ఈ ఎస్‌యూవీ ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.10.49 లక్షల నుంచి 17.49 లక్షల వరకు ఉంది.  దీనిలో ఫీచర్ల ఆధారంగా టైగన్‌ 1.0 కంఫర్ట్‌ లైన్‌, హైలైన్‌, హైలైన్‌ ఏటీ, టాప్‌లైన్‌ ఎంటీ, టాప్‌లైన్‌ ఏటీ, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌, 1.5 టీఎస్‌ఐ జీటీ లైన్‌ ప్లస్‌ వేరియంట్లను సిద్ధం చేశారు. ఈ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ కారును లుక్స్‌లో చాలా స్టైలిష్‌గా తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలు మొత్తం అందుబాటులోకి తెచ్చారు. దీనిని స్కోడా కుషాక్‌ను తయారు చేసిన MQB-A0-IN ప్లాట్‌ ఫామ్‌పైనే దీనిని కూడా డిజైన్‌ చేశారు. ఈ ప్లాట్‌ఫామ్‌ను పూర్తిగా భారత రహదారి ప్రమాణాలకు అనుకూలంగా అభివృద్ధి చేశారు. టైగన్‌ను ఇప్పటికే దేశవ్యాప్తంగా 12,221 మంది బుకింగ్‌ చేసుకొన్నారు. 

ఈ కారులో  1.0 లీటర్ త్రీ సిలిండర్‌‌, 1.5 లీటర్‌ ఫోర్‌ సిలిండర్‌ పెట్రోల్‌ ఇంజిన్లను అందుబాటులోకి తెచ్చింది. 1.0 లీటర్‌ ఇంజిన్‌ 113 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి 6స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను అమర్చారు. 1.5లీటర్‌ ఇంజిన్‌ను 148 బీహెచ్‌పీ శక్తిని విడుదల చేస్తుంది. దీనికి 6స్పీడ్‌/7స్పీడ్‌ గేర్‌బాక్స్‌ను బిగించారు. రెండు ఇంజిన్లకు ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌ ఉంది. ఎల్‌ఈడీ హెడ్‌ ల్యాంప్స్‌, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, సరికొత్త బంపర్‌, క్రోమ్‌ గ్రిల్‌ కారుకు మంచి లుక్‌ను తీసుకొచ్చాయి. 

ఆకట్టుకొనేలా ఫీచర్లు, భద్రతా ప్రమాణాలు

కారులోపల డ్యూయల్‌ టోన్‌ ఇంటీరియర్‌, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లే, ఫ్లాట్‌ బాటమ్‌ స్టీరింగ్‌ వీల్‌,  అండ్రాయిడ్‌, యాపిల్‌ కార్‌ ప్లే కనెక్ట్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్లు, యాంబియంట్‌ లైటింగ్‌, ఎలక్ట్రిక్‌ సన్‌రూఫ్‌,  వైర్‌లెస్‌ ఛార్జర్‌, రియర్‌ ఏసీ వెంట్స్‌ వంటి సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చారు.  

ఈ కారులో టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌, ఏబీఎస్‌ హిల్‌ హోల్డ్‌ కంట్రోల్‌, ఆరు ఎయిర్‌ బ్యాగ్‌లు, ఈఎస్‌సీ వ్యవస్థ, ఐఎస్‌వోఎఫ్‌ఐఎక్స్‌ ఛైల్డ్‌ సీట్‌ యాంకరింగ్‌ పాయింట్ల, రియర్‌ కెమేరా ఉన్నాయి.

హ్యూందాయ్‌ క్రెటా, కియా సెల్టోస్‌, స్కోడా కుషాక్‌ వంటి వాహనాల పోటీని దృష్టిలోపెట్టుకొని దీనిని తయారు చేశారు. దీనికి నాలుగేళ్లు లేదా లక్ష కిలోమీటర్ల వారెంటీని ఇస్తున్నారు. రూ.21,999  చెల్లించి అదనపు వారెంటీ పొందవచ్చు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని