Moto earbuds: మోటో నుంచి రెండు కొత్త ఇయర్‌బడ్స్‌.. ధర, ఫీచర్లు ఇవే..

Moto: 50dB, 46dB వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్‌ చేసే రెండు కొత్త ఇయర్‌బడ్స్‌ను మోటో భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. 

Updated : 09 May 2024 14:57 IST

Moto earbuds | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల సంస్థ మోటో (Moto) కొత్త ట్రూ వైర్‌లెస్‌ ఇయర్‌ బడ్స్‌ను (TWS earbuds) భారత్‌లో లాంచ్‌ చేసింది. మోటో బడ్స్‌ (Moto Buds), మోటో బడ్స్‌+ (Moto Buds+) పేరిట రెండు మోడల్స్‌ను ఆవిష్కరించింది. 50dB, 46dB యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌కు సపోర్ట్‌తో ఆకర్షణీయమైన రంగుల్లో వీటిని తీసుకొచ్చారు. వీటి ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి.

మోటో బడ్స్‌ ధర రూ.4,999గా కంపెనీ నిర్ణయించింది. కోరల్ పీచ్, గ్లేసియర్ బ్లూ, స్టార్‌లైట్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. త్వరలో మరిన్ని రంగుల్లో అందుబాటులోకి రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.1,000 ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. ఈ TWS ఇయర్‌బడ్స్‌లో 12.4mm డ్రైవర్స్‌ అమర్చారు. 50dB వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC) సదుపాయం ఉంది. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 42 గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో రెండు గంటలకు పైగా వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది

2023-24లో టీసీఎస్‌ సీఈఓ వేతనం రూ.25 కోట్లు

మోటో బడ్స్‌+ ధర రూ.9,999గా కంపెనీ ప్రకటించింది. ఐసీఐసీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2వేలు ఇన్‌స్టంట్‌ డిస్కౌంట్‌ పొందొచ్చు. బీచ్‌ సాండ్‌, ఫారెస్ట్ గ్రే రంగుల్లో ఈ ఇయర్‌బడ్స్‌ లభించనున్నాయి. ఈ బడ్స్‌లో 11mm వూఫర్, 6mm ట్వీటర్‌తో డ్యూయల్ డైనమిక్స్‌ డ్రైవర్‌లతో వస్తుంది. 46dB వరకు యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్‌ (ANC)కు సపోర్ట్ చేస్తుంది. తల కదలికల ఆధారంగా ఆడియోను అడ్జెస్ట్‌ చేసేందుకు సాయపడే డాల్బీ హెడ్‌ ట్రాకింగ్‌ ఫీచర్‌ ఇందులో ఉంది. ఇందులో కేస్‌ను ఒకసారి ఫుల్‌ ఛార్జి చేస్తే 38 గంటల బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. కేవలం 10 నిమిషాల ఛార్జింగ్‌తో మూడు గంటలు వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. మోటో బడ్స్‌+ కేసు వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ చేస్తుంది.

ట్రాన్సపరెన్సీ, అడాప్టివ్‌, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మోడ్స్‌ ఈ రెండింటిలో ఉన్నాయి. రెండూ Hi-Res ఆడియో సర్టిఫికేషన్‌లను కలిగిఉన్నాయి. ఎన్విరాన్‌మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ (ENC)తో కూడిన ట్రిపుల్ మైక్ సిస్టమ్‌తో వచ్చాయి. ఇయర్‌బడ్స్‌ యూఎస్‌బీ టైప్‌-సీ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తాయి. ఈ ఉత్పత్తులు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని