క్రెడిట్‌ కార్డు రుసుములతో జాగ్రత్త

కార్డు జారీ చేసేట‌ప్పుడు దానికి ప‌రిమితిని తెలియ‌జేస్తారు. ప‌రిమితి మేర‌కు వాడుకుని గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లును చెల్లిస్తే ఎటువంటి వ‌డ్డీ చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. గడువులోపల చెల్లించ లేకుంటే వడ్డీ విధిస్తారు.

Published : 16 Dec 2020 14:57 IST

కార్డు జారీ చేసేట‌ప్పుడు దానికి ప‌రిమితిని తెలియ‌జేస్తారు. ప‌రిమితి మేర‌కు వాడుకుని గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లును చెల్లిస్తే ఎటువంటి వ‌డ్డీ చెల్లించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. గడువులోపల చెల్లించ లేకుంటే వడ్డీ విధిస్తారు.

ప్రారంభ రుసుము:
క్రెడిట్‌ కార్డు జారీ చేసే సమయంలో విధించే రుసుము

వార్షిక నిర్వహణకై:
ముందుగా  నిర్ణయించిన  ప్రకారం సంవత్సరానికి కొంత రుసుము  చెల్లించాలి.

డూప్లికేట్‌ స్టేట్‌మెంట్‌ పొందినందుకు:
ఇంటికి స్టేట్‌మెంట్‌ తెప్పించుకున్నందుకు వసూలు చేసే రుసుము

ఆలస్య చెల్లింపులపై:
నిర్ణీత గడువులోగా చెల్లించని వాటికి ఆలస్య చెల్లింపు రుసుములను  పెనాల్టీగా  విధిస్తారు.

నగదు తీసుకున్నందుకు:
ఏటీఎమ్‌ల నుంచి నగదు తీసుకుని వాడుకున్నందుకు  చెల్లించే రుసుము

పరిమితికి మించి వాడుకున్నందుకు :
ప్రతి క్రెడిట్‌ కార్డుకు పరిమితి ఉంటుంది. పరిమితికి మించి వాడుకుంటే అందుకు ప్రత్యేకమైన  రుసుములను  విధిస్తారు.

సేవా రుసుము:
క్రెడిట్‌ పరిమితి, వడ్డీ, ఇతర రుసుములన్నింటినీ  కలుపుకుని వాటి మీద సేవా రుసుము  ఉంటుంది.

ఫారిన్‌ కరెన్సీ ట్రాన్సాక్షన్స్‌ చేస్తే:
విదేశాల్లో కార్డును వాడుకున్నందుకు చెల్లించే రుసుము

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని