కార్డులు.. కొత్త‌కొత్త‌గా..

ఇప్ప‌టికే కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులు మీ వ్యాలెట్ల‌లో చేరి లావాదేవీల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తున్నాయి. దేశంలో 990 మిలియ‌న్ల డెబిట‌క్ కార్డులు, 42 మిలియ‌న్ల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అంత‌క్రితం ఏడాది వీటి సంఖ్య వ‌రుస‌గా 847 మిలియ‌న్లు, 36 మిలియ‌న్లుగా ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు పెరుగుతుండ‌టంతో ఆర్‌బీఐ, బ్యాంకులు వీటికి మ‌రింత భ‌ద్ర‌తతో పాటు సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి...

Updated : 02 Jan 2021 19:17 IST

ఇప్ప‌టికే కొత్త క్రెడిట్, డెబిట్ కార్డులు మీ వ్యాలెట్ల‌లో చేరి లావాదేవీల‌ను మ‌రింత సుల‌భ‌త‌రం చేస్తున్నాయి. దేశంలో 990 మిలియ‌న్ల డెబిట‌క్ కార్డులు, 42 మిలియ‌న్ల క్రెడిట్ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అంత‌క్రితం ఏడాది వీటి సంఖ్య వ‌రుస‌గా 847 మిలియ‌న్లు, 36 మిలియ‌న్లుగా ఉంది. కార్డుల ద్వారా లావాదేవీలు పెరుగుతుండ‌టంతో ఆర్‌బీఐ, బ్యాంకులు వీటికి మ‌రింత భ‌ద్ర‌తతో పాటు సౌక‌ర్యాన్ని క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్నాయి.

క్రెడిట్‌-డెబిట్ కార్డుల్లో మార్పులు:

గత ఏడాది ఈఎమ్‌వీ చిప్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుల‌కు మారాల్సి వచ్చింది. ఈ ప్ర‌కియ పూర్తి చేయాల‌ని ఆర్‌బీఐ బ్యాంకుల‌కు సూచించింది. ఇందులో భాగంగా ఎస్‌బీఐ పాత మ్యాజిస్ర్టిప్ కార్డుల‌కు బ‌దులుగా కొత్త ఈఎమ్‌వీ-చిప్ కార్డుల‌ను ఉచితంగా అందించింది. ఈఎమ్‌వీ చిప్ కార్డులో మైక్రోప్రాసెసిర్ చిప్ ఉంటుంది. ఇది మీ కార్డు డేటాకు భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది.

మ‌ల్టీ ప‌ర్సస్, వ‌ర్చువ‌ల్ కార్డులు:

కొన్ని బ్యాంకులు ఒకే కార్డును డెబిట్-క్రెడిట్ కార్డుగా ఉప‌యోగించుకునే స‌దుపాయాన్ని క‌ల్పిస్తున్నాయి. ఇండ‌స్ఇండ్ బ్యాంక్, యూనియ‌న్ బ్యాంక్ డెబిట్-క‌మ్‌-క్రెడిట్‌ కార్డును ప్రారంభించాయి. ఈ కార్డులో రెండు ఈఎమ్‌వీ చిప్స్ ఉంటాయి. ఒక‌టి డెబిట్, మ‌రోటి క్రెడిట్ కార్డ్ ఆప్ష‌న్‌కి ప‌నిచేస్తుంది. మీ అవ‌స‌రానికి త‌గిన‌ట్లుగా ఆప్ష‌న్ ఎంచుకొని కార్డును ఉప‌యోగించ‌వ‌చ్చు. ఈ కార్డును తీసుకునేందుకు ప్రారంభ ఫీజు రూ.200-250 వ‌ర‌కు ఉంటుంది. అదేవిధంగా ఇండ‌స్ ఇండ్ బ్యాంక్ నెక్స్ట్ క్రెడిట్ కార్డును అందిస్తోంది. దీనికి బ‌ట‌న్లు ఉంటాయి. కార్డుతోనే ఈఎమ్ఐ ఆప్ష‌న్ ఎంచుకునే అవ‌కాశం కూడా ఉంటుంది. కార్డుపై ల‌భించిన పాయింట్ల‌ను కూడా రిడీమ్ చేసుకోవ‌చ్చు. కొన్ని బ్యాంకులు వ‌ర్చువ‌ల్ కార్డుల‌ను అందిస్తున్నాయి. ఈ కార్డుల‌ను మొబైల్‌లో లోడ్ చేసుకొని ఫోన్‌ ద్వారానే ఉప‌యోగించ‌వ‌చ్చు.

లోక‌ల్ బ్రాండెడ్, ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల ఒప్పందం:

క్రెడిట్‌-డెబిట్ కార్డుల లావాదేవీల‌ను పెంచేందుకు బ్యాంకులు, ఈ-కామ‌ర్స్ సంస్థ‌ల‌తో పాటు స్థానిక వ్యాపారుల‌తో జ‌త‌క‌డుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు చండీఘ‌డ్‌లో బ్యాంకులు స్థానిక రెస్టారెంట్ల‌తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్యాంకులు త‌మ వినియోగ‌దారుల‌కు వీలైనంత సౌక‌ర్యాన్ని అందించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి.

అయితే చివ‌ర‌గా చెప్పేదేంటంటే క్రెడిట్ కార్డులు చేతిలో ఉన్నాయి క‌దా అని ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఖ‌ర్చు చేస్తే త‌ర్వాత మీ క్రెడిట్ స్కోర్‌పై ప్ర‌భావం ప‌డుతుంది జాగ్ర‌త్త‌!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని