Electronic city: దిల్లీలో ఎలక్ట్రానిక్‌ సిటీ.. 80వేల ఉద్యోగాల కల్పన!

ఉపాధి కల్పన, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తే లక్ష్యంగా దేశ రాజధానిలో ఎలక్ట్రానిక్స్‌ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది....

Published : 26 Mar 2022 18:19 IST

బడ్జెట్‌లో దిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రకటన

దిల్లీ: ఉపాధి కల్పన, ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తే లక్ష్యంగా దేశ రాజధానిలో ఎలక్ట్రానిక్స్‌ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు దిల్లీ ప్రభుత్వం ప్రకటించింది. తద్వారా 80,000 కొత్త ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్‌ సిసోడియా ఈ ప్రకటన చేశారు.

బప్రోలాలో ఎలక్ట్రానిక్స్‌ సిటీని ఏర్పాటు చేయనున్నట్లు సిసోడియా తెలిపారు. దీంతో ఐటీ కంపెనీలు కూడా దేశ రాజధాని వైపు అడుగులేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అభివృద్ధికి నోచుకోని పారిశ్రామిక ప్రాంతాల పునరుద్ధరణ ద్వారా మరో 6 లక్షల కొత్త ఉద్యోగాలను సృష్టిస్తామన్నారు. మొత్తం రూ.75,800 కోట్ల బడ్జెట్‌ను సిసోడియా అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. గత ఏడాది రూ.69,000 కోట్ల బడ్జెట్‌తో పోలిస్తే ఈసారి 9.86 శాతం నిధులు పెరిగాయి. ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం వరుసగా ఎనిమిదోసారి దిల్లీ అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. తాజాగా ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌ను సిసోడియా ‘రోజ్‌గార్‌ బడ్జెట్‌’ (ఉపాధి బడ్జెట్‌)గా అభివర్ణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని