Published : 18 Feb 2022 15:58 IST

స‌రైన టైమ్‌లో ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్‌..

ధ‌న‌వంతులు కావ‌డానికి ఓపిక, సంప‌ద నిర్మాణ వ్యూహం, స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక‌, భ‌విష్య‌త్తులో మంచి జీవ‌న‌శైలిని గ‌డ‌పాల‌నే ఆశావాదం ఉండాలి. దీనికి ముందు త‌గిన నేర్పు, ఓర్పు ఉండాలి. దీనికి స‌రిప‌డా ఆర్ధిక వ్యూహం మీ ద‌గ్గ‌ర లేక‌పోయినా ఒక ప్రొఫెష‌న‌ల్ ప్లాన‌ర్ మీ జీవిత ల‌క్ష్యాలు, ఖ‌ర్చులు, భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు, జీవ‌న‌శైలి, ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌లు నిశితంగా ప‌రిశీలించి మీ కోసం అనుకూల ప్ర‌ణాళిక‌ను రూపొందించ‌వ‌చ్చు.

అయితే, ఇద్ద‌రు సోద‌రులు త‌మ జీవితంలో డ‌బ్బును ఎలా ఖ‌ర్చు పెట్టారు, ఎలా మ‌దుపు చేశారు అనే దానిపై చిన్న విశ్ల‌ష‌ణ ఇది. విజ‌య్‌, విశాల్ అనే క‌వ‌ల‌ సోద‌రుల‌కు 21వ పుట్టిన రోజున వారి తండ్రి 2001లో ఒక్కొక్క‌రికి రూ. 50 వేలు చొప్పున బ‌హుమ‌తిగా ఇచ్చారు. విజ‌య్‌, విశాల్ ఇద్ద‌రూ దాదాపు అన్ని కోణాల్లో ఒకేలా ఉంటారు. ఇద్ద‌రూ ఒకే ఇంజినీరింగ్ కాలేజీలో చ‌దువుకున్నారు. ఇద్ద‌రూ బెంగుళూరులోని ఒకే ఐటీ సంస్థ‌లో ఉద్యోగానికి వెళ్లి, త‌ర్వాత పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే, ఇక్క‌డ ఒక వ్యత్యాసం ఉంది. క‌వ‌ల సోద‌రుల‌కు 40 ఏళ్లు వ‌చ్చే స‌రికి, విశాల్‌కు తండ్రి బ‌హుమ‌తిగా ఇచ్చిన రూ. 50 వేల విలువ రూ. 72,59,637కు పెరిగింది. విజ‌య్ కు బ‌హుమ‌తిగా వ‌చ్చిన అదే రూ. 50 వేల డ‌బ్బు విలువ రూ. 2,131కి ప‌డిపోయింది. ఇద్ద‌రి విష‌యంలో ఇంత తేడా ఎలా జ‌రిగింది? విశాల్‌ సంప‌ద మీద స‌రైన వ్యూహంతో వ్య‌వ‌హ‌రించారు. విజ‌య్, తండ్రి ఇచ్చిన డ‌బ్బుకి స‌రైన మార్గ నిర్దేశం చేయ‌లేదు.

విజ‌య్ త‌న రూ. 50 వేల‌కి ఇంకో రూ. 5 వేలు జ‌త చేసి ఐష‌ర్ మోటార్స్ ఉత్ప‌త్తికి చెందిన ఒక రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్‌ని ఆ స‌మ‌యంలో రేటుకి కొనుగోలు చేశాడు.

విశాల్ అదే ఐష‌ర్ మోటార్స్‌కు చెందిన 2,857 షేర్స్ ని ఒక్కో షేర్ కి రూ. 17.50 చొప్పున కొనుగోలు చేయ‌డానికి రూ. 50 వేలు పెట్టుబ‌డి పెట్టారు.

విజ‌య్‌, విశాల్ ఇద్ద‌రూ త‌మ తండ్రి ఇచ్చిన బ‌హుమ‌తిని ఒకే కంపెనీ నుండి కొనుగోలు చేశారు. విజ‌య్ బైక్ విలువ 95% త‌గ్గింది. విశాల్ స్టాక్ విలువ 14,419% పెరిగింది. ఒక‌రు తండ్రి ఇచ్చిన బ‌హుమ‌తిని తన ఆనందానికి ఉప‌యోగిస్తే, ఒక‌రు విభిన్నంగా ఆలోచించి ఆస్తి కొనుగోలుకు ఉప‌యోగించారు. ఇది కేవ‌లం ఒక నిర్ణ‌యం.

స‌రైన ఆర్ధిక ప్ర‌ణాళిక శ‌క్తి విశాల్‌కి తెలుసు, అందుచేత‌నే 20 ఏళ్ల క్రిత‌మే మంచి ఆర్ధిక నిర్ణ‌యం తీసుకున్నాడు. విశాల్ ప్ర‌తి రుపాయిని దాని గ‌రిష్ట సామ‌ర్ధ్యానికి విస్త‌రించాడు. తత్ఫలితంగా అత‌ను భార్యా పిల్ల‌ల‌తో విదేశీ ప‌ర్య‌ట‌న చేయ‌గ‌లిగాడు, పిల్ల‌ల‌ను మంచి అత్యుత్త‌మ మేనేజ్‌మెంట్ క‌ళాశాల‌ల్లో చ‌దివించ‌గ‌లిగాడు. ప‌ద‌వీ విర‌మ‌ణ కూడా తీసుకుని జీవితాన్ని సుర‌క్షితం చేసుకున్నాడు. కానీ విజ‌య్‌కి ఒక పాత మోటారు వాహ‌నం మిగిలింది.

మీకు 21 ఏళ్లు, 35 లేదా 55 ఏళ్లు ఉన్నా స‌రే, మీరు ఈ రోజే ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను ప్రారంభించ‌వ‌చ్చు. అనుభ‌వ‌జ్ఞుడైన ఫైనాన్షియ‌ల్ ప్లాన‌ర్ మీ కోసం ప‌నిచేసే అనుకూల ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తారు. మీరు ఎన్న‌డూ అనుభ‌వించ‌ని సంతృప్తి, విశ్వాసాన్ని అనుభ‌విస్తారు. సంప‌ద‌ను పెంచే పెట్టుబ‌డుల ప్ర‌యోజ‌నాన్ని పొంద‌డానికి, భ‌విష్య‌త్తు కోసం అత్య‌వ‌స‌ర ప‌రిస్థితులు ఎదురైనా స‌రే,  త‌గిన నిధుల‌ను క‌లిగి ఉండ‌టానికి మీకు బ‌ల‌మైన ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను క‌లిగి ఉంటారు. కాబ‌ట్టి ఈ రోజే భ‌విష్య‌త్తు ఆర్ధిక ప్ర‌ణాళిక‌ను ప్రారంభించండి. విజ‌య్‌లాగా మీరు త‌ర్వాత బాధ‌ప‌డ‌న‌క్క‌ర్లేదు. స‌రైన‌ ఫైనాన్షియ‌ల్ ప్లానింగ్‌, జీవ‌నశైలి భ‌విష్య‌త్తులో బ్ర‌త‌క‌డం ఎలాగో నేర్పిస్తుంది.

*పైన తెలిపినది ఒక ఉదాహరణ మాత్రమే. ఎవరి అవసరాలని వారు ద్రుష్టిలో ఉంచుకుని ఖర్చులు పెట్టాలి, మదుపు చేయాలి. షేర్ల‌లో పెట్టుబ‌డులు మార్కెట్ రిస్క్‌కి లోబ‌డి ఉంటాయి. పెట్టుబ‌డులు పెట్టేముందు ఆఫ‌ర్ డాక్యుమెంట్‌ని పూర్తిగా చ‌దివి అర్ధం చేసుకోవాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని