భారత్‌లో సంయుక్త సంస్థల ఏర్పాటుకు యాపిల్‌ సరఫరాదార్ల ఆసక్తి

భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యాపిల్‌ భావిస్తున్న తరుణంలో.. ఈ కంపెనీ సరఫరాదార్లయిన పలు చైనా కంపెనీలు, భారత సంస్థలతో కలిసి సంయుక్త సంస్థ(జేవీ)లను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి.

Published : 26 Jan 2023 02:32 IST

దిల్లీ: భారత్‌లో తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలని యాపిల్‌ భావిస్తున్న తరుణంలో.. ఈ కంపెనీ సరఫరాదార్లయిన పలు చైనా కంపెనీలు, భారత సంస్థలతో కలిసి సంయుక్త సంస్థ(జేవీ)లను ఏర్పాటు చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నాయి. ఇందు కోసం త్వరలోనే ప్రభుత్వ అనుమతులనూ కోరవచ్చని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. భారత్‌లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను పెట్టదలచే ఇతర దేశ కంపెనీలు ప్రభుత్వం నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాల్సి ఉంది. పలు చైనా సరఫరాదార్లకు ఇప్పటికే కేంద్రం కొన్ని ప్రాథమిక అనుమతులు సైతం ఇచ్చినట్లు ఆ వర్గాలు చెబుతున్నాయి. చైనాలోని సరఫరాదార్ల విషయంలో యాపిల్‌కు కొన్ని ఆందోళనలున్న నేపథ్యంలో, ప్రభుత్వంతో అనధికారికంగా ఈ విషయాన్ని చర్చించినట్లూ విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. కంపెనీ తనకు నచ్చిన కొంత మంది సరఫరాదార్ల జాబితాను ప్రభుత్వంతో అనధికారికంగా పంచుకుందని.. ఇందులో చాలా వాటికి ప్రభుత్వం నుంచి అనుమతులు లభించొచ్చని తెలుస్తోంది. యాపిల్‌ సిఫారసు ఉన్న కంపెనీలు, అనుమతుల కోసం త్వరలోనే దరఖాస్తు చేయొచ్చని ఆ వర్గాలు అంటున్నాయి. స్థానిక భాగస్వామితో ఇవి ముందుకురావొచ్చనీ వివరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని