Wipro: హైదరాబాద్‌, బెంగళూరుల్లో విప్రో ఆస్తుల విక్రయం!

ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. బెంగళూరు, హైదరాబాద్‌లలో తన రెండు కార్యాలయాలకు చెందిన ఆస్తులను విక్రయించాలని భావిస్తోందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. తన ప్రధానేతర స్థిరాస్తులను అమ్మడం ద్వారా వచ్చిన నగదును, కార్యకలాపాల స్థిరీకరణ కోసం వినియోగించాలని భావిస్తోందని ఆ కథనం తెలిపింది.

Updated : 23 Nov 2023 08:32 IST

హైదరాబాద్‌: ఐటీ దిగ్గజ సంస్థ విప్రో.. బెంగళూరు, హైదరాబాద్‌లలో తన రెండు కార్యాలయాలకు చెందిన ఆస్తులను విక్రయించాలని భావిస్తోందని ఒక ఆంగ్ల వార్తా సంస్థ పేర్కొంది. తన ప్రధానేతర స్థిరాస్తులను అమ్మడం ద్వారా వచ్చిన నగదును, కార్యకలాపాల స్థిరీకరణ కోసం వినియోగించాలని భావిస్తోందని ఆ కథనం తెలిపింది. హైబ్రిడ్‌ పని విధానం వల్ల కార్యాలయాల అవసరం తగ్గినందున, వేర్వేరు నగరాల్లోని కార్యకలాపాలను స్థిరీకరించడం కోసం ఈ నిర్ణయం తీసుకుందని ఆ వర్గాలు అంటున్నాయి. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో 14 ఎకరాలు, బెంగళూరులోని ఎలక్ట్రానిక్‌ సిటీలో ఉన్న 25 ఎకరాలను విక్రయించేందుకు సంస్థ మదింపు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఊహాగానాలపై వ్యాఖ్యానించబోమని విప్రో ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు