సేవల ఎగుమతులు స్వల్పంగా తగ్గాయ్‌

మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్‌ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గురువారం తెలిపింది.

Published : 03 May 2024 03:30 IST

మార్చిలో రూ.2.5 లక్షల కోట్లకు  పరిమితం: ఆర్‌బీఐ

ముంబయి: మన దేశం నుంచి సేవల ఎగుమతులు, ఏడాది క్రితంతో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో 1.3% తగ్గి 30 బిలియన్‌ డాలర్ల (సుమరు రూ.2.5 లక్షల కోట్ల)కు పరిమితమయ్యాయని రిజర్వ్‌ బ్యాంక్‌ గురువారం తెలిపింది. దిగుమతులూ 2.1% తగ్గి 16.61 బి.డాలర్ల (సుమారు రూ.1.38 లక్షల కోట్ల)కు చేరాయి. దీంతో వాణిజ్య మిగులు 2024 మార్చిలో 13.4 బి.డాలర్లు (సుమారు రూ.1.11 లక్షల కోట్లు)గా నమోదైందని భారత అంతర్జాతీయ వాణిజ్యం (సేవల)పై ఆర్‌బీఐ తెలిపింది. సేవల ఎగుమతులు, దిగుమతులు రెండూ, అంతకు ముందు 2 నెలల్లోనూ సానుకూలంగా ఉన్నాయని తెలిపింది.

  • వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, 2023-24లో సేవల ఎగుమతులు 339.62 బి.డాలర్లు (సుమారు రూ.28.18 లక్షల కోట్లు), దిగుమతులు 177.56 బి.డాలర్లు (సుమారు రూ.14.73 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని అంచనా. వాణిజ్య మిగులు (ఎగుమతులు, దిగుమతుల బిల్లుల మధ్య వ్యత్యాసం) 162 బి.డాలర్లు (రూ.13.45 లక్షల కోట్లు)గా ఉండొచ్చు.
  • అంతర్జాతీయ సవాళ్లున్నా మొత్తం ఎగుమతులు (వస్తు, సేవలు) గత ఆర్థిక సంవత్సరంలో 776.68 బి.డాలర్లు (సుమారు రూ.64.46 లక్షల కోట్లు)గా నమోదయ్యాయని అంచనా. 2022-23లో ఇవి 776.40 బి.డాలర్లు (సుమారు రూ.64.44 లక్షల కోట్లు)గా ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని