‘కొవాగ్జిన్‌’ ఆవిష్కరణలో భద్రతకే పెద్దపీట

టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్‌’ టీకాను రూపొందించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం.

Published : 03 May 2024 03:25 IST

భారత్‌ బయోటెక్‌ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: టీకా తీసుకున్న ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా ‘కొవాగ్జిన్‌’ టీకాను రూపొందించినట్లు భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ గురువారం వెల్లడించింది. ‘ఏదైనా టీకా ప్రభావం కొంతకాలమే ఉండొచ్చు, కానీ రోగుల భద్రత ఎంతో ముఖ్యం. కొవాగ్జిన్‌ విషయంలో దీనికే అధిక ప్రాధాన్యం ఇచ్చాం’ అని సంస్థ వివరించింది. కొవిడ్‌- 19 ముప్పును ఎదుర్కోడానికి ‘కొవాగ్జిన్‌’ టీకాను భారత్‌ బయోటెక్‌ ఆవిష్కరించిన విషయం విదితమే. ఈ టీకా ప్రభావం, పనితీరును ఇప్పటికీ పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది. మనదేశంలో విస్తృత స్థాయిలో క్లినికల్‌ పరీక్షలు నిర్వహించిన ఏకైక కొవిడ్‌- 19 టీకా ‘కొవాగ్జిన్‌’ మాత్రమేనని గుర్తు చేసింది. దాదాపు 27,000 మంది వాలంటీర్లపై దీన్ని పరీక్షించినట్లు తెలియజేసింది. టీకా భద్రత, ప్రభావాన్నీ కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌లు, పరిశోధనా సంస్థలూ పరిశీలించినట్లు పేర్కొంది. కొవాగ్జిన్‌ టీకా ఎంతో బాగా పనిచేయడమే కాకుండా, ఎంతో భద్రమైనదని ఇప్పటికే నిర్థారణ అయినట్లు వివరించిందిడీ టీకా తీసుకున్న వారిలో రక్తం గడ్డ కట్టడం, త్రాంబోసైటోపెనియా, టీటీఎస్‌, వీఐటీటీ, పెరికార్డిటిస్‌, మయోకార్డిటిస్‌.. తదితర లక్షణాలు ఎక్కడా కనిపించలేదని స్పష్టం చేసింది. తాము తీసుకువచ్చే టీకాలన్నింటి విషయంలో, వినియోగదారుల భద్రతే ప్రథమ ప్రాధాన్యమని భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు