కోల్‌ ఇండియా లాభంలో 26% వృద్ధి

కోల్‌ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం.

Published : 03 May 2024 03:25 IST

దిల్లీ: కోల్‌ ఇండియా మార్చి త్రైమాసికంలో రూ.8,682.20 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.6,875.07 కోట్ల కంటే ఇది 26.2% అధికం. మొత్తం ఆదాయం రూ.40,371.51 కోట్ల నుంచి రూ.39,654.50 కోట్లకు పరిమితమైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) కోల్‌ ఇండియా పన్ను అనంతర లాభం 17.8% పెరిగి రూ.37,369 కోట్లుగా ఉంది. 2022-23లో ఇది రూ.31,723 కోట్లుగా నమోదైంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుపై రూ.5 తుది డివిడెండును బోర్డు సిఫారసు చేసింది. మొత్తం వ్యయాలు రూ.30,873 కోట్ల నుంచి రూ.28,298 కోట్లకు తగ్గాయి. బొగ్గు ఉత్పత్తి 224.16 మిలియన్‌ టన్నుల నుంచి 241.75 మిలియన్‌ టన్నులకు పెరిగింది. విక్రయాలు తగ్గినా, వ్యయ నియంత్రణ చర్యలే, లాభంలో వృద్ధికి తోడ్పడ్డాయని కోల్‌ ఇండియా తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని