అంతరిక్ష రంగానికి రూ.2వేల కోట్ల పెంపు

మధ్యంతర బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,042.75 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

Published : 02 Feb 2024 04:24 IST

దిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో అంతరిక్ష రంగానికి రూ.13,042.75 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు. 2023-24కు సంబంధించి సవరించిన అంచనాల ప్రకారం ఈ రంగానికి కేటాయింపులు రూ.11,070.07 కోట్లు. ఈ లెక్కన తాజా బడ్జెట్‌లో దాదాపు రూ.2వేల కోట్లు పెరుగుదల నమోదైనట్లే. అంతరిక్ష పరిజ్ఞాన రంగానికి ఈసారి రూ.10,087 కోట్లు ప్రతిపాదించారు. 2023-24లో ఈ పద్దు కింద రూ.8,180 కోట్లు కేటాయించారు. 2035 నాటికి భారత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించాలని, 2040 నాటికి భారత వ్యోమగామిని చంద్రుడిపైకి పంపాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఈ కేటాయింపులు జరిగాయి.

అణుశక్తి శాఖకు రూ.36,159.93 కోట్లను తాజా బడ్జెట్‌లో కేటాయించారు. 2023-24 కేటాయింపుల (రూ.36,905.45 కోట్లు)తో పోలిస్తే ఇప్పుడు ఈ పద్దు కింద కోత పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని