హైదరాబాద్‌లో మలబార్‌ కళాత్మక విక్రయ కేంద్రం

హైదరాబాద్‌ (సోమాజిగూడ), న్యూస్‌టుడే: ప్రముఖ బంగారు, వజ్రాభరణాల రిటైల్‌ షోరూమ్‌ల్లో ఒకటైన మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఆర్టిస్ట్రీ కాన్సెప్ట్‌తో (కళాత్మక) కొత్త విక్రయ కేంద్రాన్ని ప్రారంభించింది. హైదరాబాద్‌లోని సోమాజిగూడలో దాదాపు 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో భాగ్యనగర కళా వారసత్వం, చరిత్రను ప్రతిబింబిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన డిజైన్లు అందుబాటులో ఉండనున్నాయి. దేశంలోనే ఇది తొలి ఆర్టిస్ట్రీ కాన్సెప్ట్‌ స్టోర్‌ అని మలబార్‌ పేర్కొంది. శనివారం ఈ విక్రయ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహ్మద్‌ మహమూద్‌ అలీ ప్రారంభించారు. దేశంలోనే తొలి బంగారం శుద్ది కర్మాగారాన్ని హైదరాబాద్‌లో రూ.750 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు మలబార్‌ గ్రూపు నిర్ణయించింది. దీని ద్వారా 2500 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనుంది. ప్రతిపాదిత పెట్టుబడిలో భాగంగానే ఈ ఆర్టిస్ట్రీ స్టోర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా మలబార్‌ గ్రూపు ఛైర్మన్‌ ఎం.పి.అహమ్మద్‌ మాట్లాడుతూ.. వినియోగదారులకు ప్రతి సందర్భానికి సరిపడే ఆభరణాలను అందించడమే ఈ విక్రయ కేంద్రం లక్ష్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో 260కి పైగా విక్రయకేంద్రాలున్నాయని.. దేశంలో 500 విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఇండియా ఆపరేషన్స్‌ ఎండీ ఒ.అషర్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో అంతర్జాతీయ ఆపరేషన్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.పి.షామ్లాల్‌ అహ్మద్‌, సహ ఛైర్మన్‌ పి.ఏ.ఇబ్రహీం హాజీ, వైస్‌ ఛైర్మన్‌ కె.పి.అబ్దుల్‌ సలాం పాల్గొన్నారు.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని