
Published : 02 Dec 2021 01:59 IST
బీఐఎస్ నమోదిత పసిడి విక్రేతల సంఖ్య మూడింతలు
ముంబయి: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) వద్ద నమోదైన పసిడి వర్తకుల సంఖ్య నవంబరు 15కు మూడింతలు అధికమై 1,24,034కు చేరింది. ఈ ఏడాది జూన్ నుంచి పసిడి ఆభరణాల హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేసిన ప్రభుత్వం, దశల వారీగా దీనిని అమలు చేస్తోంది. ప్రభుత్వ నిర్ణయం తర్వాతే నమోదిత వర్తకుల సంఖ్య పెరిగినట్లు రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) వెల్లడించింది. జూన్‌లో బీఐఎస్ నమోదిత వర్తకుల సంఖ్య 43,153 మాత్రమే అని తెలిపింది. అసేయింగ్, హాల్‌మార్కింగ్ కేంద్రాలు (ఏహెచ్‌సీలు) సంఖ్య కూడా 948 నుంచి 978కు పెరిగింది. హాల్‌మార్కింగ్‌ను తప్పనిసరి చేయడం వల్ల వినియోగదారు విశ్వాసం బలోపేతమైందని జీజేఈపీసీ ఛైర్మన్ కొలిన్ షా అన్నారు.
Tags :