స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఐపీఓకు సెబీ పచ్చజెండా

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా స్టెరిలైట్‌ పవర్‌ రూ.1,250 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది.

Published : 07 Dec 2021 01:42 IST

అనిల్‌ అగర్వాల్‌కు చెందిన స్టెరిలైట్‌ పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ పబ్లిక్‌ ఇష్యూకు సెబీ ఆమోదం తెలిపింది. ఈ ఇష్యూ ద్వారా స్టెరిలైట్‌ పవర్‌ రూ.1,250 కోట్లు సమీకరించాలని అనుకుంటోంది. ఈ నిధులను కంపెనీ, దాని అనుబంధ సంస్థ ఖర్గోన్‌ ట్రాన్స్‌మిషన్‌ లిమిటెడ్‌ తీసుకున్న రుణాల చెల్లింపునకు వినియోగించనున్నారు.

* డేటా కేంద్రాల సంస్థ ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ అండ్‌ క్లౌడ్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ ఇష్యూ ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. రూ.322 కోట్ల విలువైన తాజా షేర్లను, ఆఫర్‌ ఫర్‌ సేల్‌లో ప్రస్తుత వాటాదార్లు, ప్రమోటరు గ్రూపు సభ్యులకు చెందిన 2.14 కోట్ల ఈక్విటీ షేర్లను సంస్థ విక్రయించనుంది. మర్చంట్‌ బ్యాంకింగ్‌ వర్గాల అంచనా ప్రకారం.. ఈ ఇష్యూ ద్వారా రూ.1,200- 1,300 కోట్లు సమకూరే అవకాశం ఉంది. ఈ నిధులను డేటా కేంద్రాలకు క్లౌడ్‌ కంప్యూటింగ్‌ సామగ్రి కొనుగోలు కోసం, నిర్వహణ మూలధన అవసరాలకు, రుణాల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు కంపెనీ వినియోగించనుంది.

* పబ్లిక్‌ ఇష్యూ ద్వారా రూ.500 కోట్లు సమీకరించాలన్న ప్రతిపాదనకు ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌ బోర్డు ఆమోదం తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని