వాణిజ్య పద్మాలు

ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాల: ప్రముఖ లోదుస్తుల సంస్థ రూపా అండ్‌ కోను 1968లో స్థాపించారు. అనంతరం ఇతర రకాల దుస్తుల విభాగాలకు విస్తరించారు. జాన్‌, ఫ్రంట్‌లైన్‌, యూరో, మ్యాక్రోమన్‌ వంటి బ్రాండ్లు

Published : 26 Jan 2022 03:53 IST

దేశంలో నలుగురు వాణిజ్య ప్రముఖులకు పద్మశ్రీ పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది.

ప్రహ్లాద్‌ రాయ్‌ అగర్వాల: ప్రముఖ లోదుస్తుల సంస్థ రూపా అండ్‌ కోను 1968లో స్థాపించారు. అనంతరం ఇతర రకాల దుస్తుల విభాగాలకు విస్తరించారు. జాన్‌, ఫ్రంట్‌లైన్‌, యూరో, మ్యాక్రోమన్‌ వంటి బ్రాండ్లు ఈ కంపెనీవే.


జగ్జీత్‌ సింగ్‌ దర్ది: చార్దిక్లా గ్రూప్‌ సంస్థలను 1977లో స్థాపించి, మీడియా దిగ్గజంగా ఎదిగారు. 1970లో మాసపత్రికను ప్రారంభించిన ఆయన.. 1977లో దినపత్రికగా మార్చారు. అనంతరం కాలంలో టైమ్‌ టీవీతో మరింత దూసుకెళ్లారు. స్వతహాగా ఇంజినీర్‌ అయిన దర్ది.. 12 ఏళ్ల వయసులోనే వార్తలు రాయడం మొదలుపెట్టారు.


ముక్తమణి దేవి: 1990లో ముక్తా షూస్‌ను ప్రారంభించి ప్రాచుర్యం పొందారు. వేల మందికి బూట్లు, చెప్పులను చేతితో తయారు చేయడంలో శిక్షణ ఇచ్చారు.


ర్యూకో హిరా: జపాన్‌ కేంద్రంగా పనిచేసే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ హెచ్‌ఎంఐ హోటల్‌ గ్రూప్‌ అధిపతి ర్యూకో హిరా. జపాన్‌లో దాదాపు 60 శాతం రిసార్ట్‌లు, బిజినెస్‌ హోటళ్లు ఈ సంస్థ చేతిలోనే ఉన్నాయి. 1948లో రాజస్థాన్‌లో ర్యూకో హిరా జన్మించారు. టోక్యోలో రత్నాల వ్యాపారం చేసిన తర్వాత, జపాన్‌ మహిళను పెళ్లి చేసుకుని ఆ దేశంలోనే స్థిరపడ్డారు. 1991లో హోటల్‌ పెర్ల్‌ సిటీ కోబ్‌ను నెలకొల్పి అంచెలంచెలుగా ఎదిగారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని