ఈ ఏడాది 2 3 సార్లు రెపో రేటు పెరగొచ్చు

వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ వెనకబడి ఏమీ లేదని.. ఈ ఏడాది రెండు లేదా మూడు సార్లు రెపో రేటును పెంచే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ కేకీ మిస్త్రీ అంచనా వేస్తున్నారు. ఉద్యోగ సృష్టి, ఆదాయ స్థాయుల పెంపు,

Published : 23 Apr 2022 01:38 IST

కేకీ మిస్త్రీ అంచనా

ముంబయి: వడ్డీ రేట్ల విషయంలో ఆర్‌బీఐ వెనకబడి ఏమీ లేదని.. ఈ ఏడాది రెండు లేదా మూడు సార్లు రెపో రేటును పెంచే అవకాశం ఉందని హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌ ఛైర్మన్‌, సీఈఓ కేకీ మిస్త్రీ అంచనా వేస్తున్నారు. ఉద్యోగ సృష్టి, ఆదాయ స్థాయుల పెంపు, వినియోగంలో వృద్ధికి కారణమయ్యేలా ఆర్థిక వ్యవస్థలో వృద్ధిని కొనసాగించడం దేశానికి అత్యంత ముఖ్యమని ఆయన అన్నారు. వడ్డీ రేట్లు పెరిగినా ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఉండదని చెప్పారు. భారత ద్రవ్యోల్బణాన్ని అమెరికా ద్రవ్యోల్బణం (8.5%+)తో పోల్చరాదని  అన్నారు. ‘ముడిచమురు బ్యారెల్‌ ధర 75 డాలర్లుగా ఉండేది. ఇపుడు 107 డాలర్లకు వచ్చింది. పూర్తి ఏడాది ఇదే రేటు కొనసాగకపోవచ్చు. 90- 95 డాలర్ల వద్ద స్థిరపడుతుందని అనుకుంటే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం కిందకు దిగి వస్తుంద’ని మిస్త్రీ అంచనా వేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు