LIC IPO: ఎల్‌ఐసీ ఐపీఓకు 1.66 రెట్ల స్పందన.. దరఖాస్తుకు రేపే ఆఖరు రోజు

ఎల్‌ఐసీ ఐపీఓ నాలుగో రోజైన శనివారం నాటికి మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 1.66 రెట్ల స్పందన లభించింది. 16,20,78,067 షేర్లను ఆఫర్‌ చేయగా, 26,83,18,335 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి

Updated : 08 May 2022 07:38 IST

దిల్లీ: ఎల్‌ఐసీ ఐపీఓ నాలుగో రోజైన శనివారం నాటికి మొత్తం అన్ని విభాగాల్లో కలిపి 1.66 రెట్ల స్పందన లభించింది. 16,20,78,067 షేర్లను ఆఫర్‌ చేయగా, 26,83,18,335 షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. ఎన్‌ఐఐ (సంస్థాగతేతర మదుపర్ల) విభాగం నుంచీ పూర్తి స్పందన లభించింది. వీరికి 2,96,48,427 షేర్లను రిజర్వ్‌ చేయగా, 3,21,59,055 షేర్లకు (1.08 రెట్లు) బిడ్లు దాఖలైనట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీల వద్ద లభ్యమవుతున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. అర్హులైన సంస్థాగత మదుపర్ల (క్యూఐబీ) విభాగంలో మాత్రం 67 శాతం స్పందనే లభించింది. రిటైల్‌ వ్యక్తిగత మదుపర్లకు 6.9 కోట్ల షేర్లను కేటాయించగా,    10.06 కోట్ల షేర్లకు (1.46 రెట్లు) బిడ్లు దాఖలయ్యాయి. పాలసీదార్ల విభాగంలో 4.67 రెట్లు, ఉద్యోగుల విభాగంలో 3.54 రెట్ల స్పందన లభించింది. ఈ ఐపీఓకు దరఖాస్తులు సమర్పించేందుకు సోమవారం చివరి రోజు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని