ఐటీసీ తుది డివిడెండ్‌ 625 శాతం

మార్చి త్రైమాసికానికి రూ.4259.68 కోట్ల నికరలాభాన్ని ఐటీసీ లిమిటెడ్‌ ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.3816.84 కోట్ల కంటే ఇది 11.60 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల

Published : 19 May 2022 02:43 IST

దిల్లీ: మార్చి త్రైమాసికానికి రూ.4259.68 కోట్ల నికరలాభాన్ని ఐటీసీ లిమిటెడ్‌ ప్రకటించింది. 2020-21 ఇదే కాల లాభం రూ.3816.84 కోట్ల కంటే ఇది 11.60 శాతం అధికం. ఇదే సమయంలో కార్యకలాపాల ఆదాయం రూ. 15404.37 కోట్ల నుంచి 15.25 శాతం పెరిగి రూ.17754.02 కోట్లకు చేరింది. వ్యయాలు కూడా రూ.10994.64 కోట్ల నుంచి 15.41 శాతం అధికమై రూ.12632.29 కోట్లకు చేరాయి. 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరానికి నికరలాభం రూ.15485.65 కోట్లుగా నమోదైంది. 2020-21లో ఇది రూ.13389.8 కోట్లు మాత్రమే. ఆదాయం కూడా రూ.53,155.12 కోట్ల నుంచి రూ.65204.96 కోట్లకు చేరింది. గత ఆర్థిక సంవత్సరానికి 1 రూపాయి ముఖ విలువ కలిగిన ప్రతి షేరుకు తుది డివిడెండుగా రూ.6.25 (625 శాతం) ఇవ్వాలని డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. మార్చిలో ఇచ్చిన రూ.5.25 కలుపుకుంటే, 2021-22కు మొత్తం రూ.11.50 డివిడెండ్‌ ఇచ్చినట్లు అవుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని