ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం...

మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం కేర్‌ హెల్త్‌ ప్రత్యేక బృంద పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మామ్స్‌ బిలీఫ్‌తో కలిసి ఈ పాలసీని అందించనుంది. ఈ పాలసీ పేరు మామ్స్‌ బిలీఫ్‌ కేర్‌-ఆద్విక్‌ చైల్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌.

Updated : 25 Feb 2022 00:35 IST

మానసిక సమస్యలతో బాధపడుతున్న చిన్నారుల కోసం కేర్‌ హెల్త్‌ ప్రత్యేక బృంద పాలసీని అందుబాటులోకి తీసుకొచ్చింది. మామ్స్‌ బిలీఫ్‌తో కలిసి ఈ పాలసీని అందించనుంది. ఈ పాలసీ పేరు మామ్స్‌ బిలీఫ్‌ కేర్‌-ఆద్విక్‌ చైల్డ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్‌. ఆటిజం, కుంగుబాటు, నేర్చుకునే సామర్థ్య లోపం తదితర ప్రత్యేక అవసరాలున్న వారికి అవసరమైన వైద్య చికిత్సల కోసం ఈ పాలసీని తీసుకొచ్చినట్లు మామ్స్‌ బిలీఫ్‌ సీఈఓ, వ్యవస్థాపకుడు నితిన్‌ బింద్లీశ్‌ తెలిపారు. 0-15 ఏళ్ల మధ్య ఉన్న ఈ పిల్లలు ఆసుపత్రిలో చేరాల్సి వచ్చినప్పుడు చికిత్స ఖర్చు చెల్లించేలా ఈ పాలసీని కేర్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌తో కలిసి రూపొందించినట్లు పేర్కొన్నారు. రూ.1.5లక్షల నుంచి రూ.4లక్షల వరకూ ఈ పాలసీ ఉంటుంది. ఇది ప్రత్యేక బృంద పాలసీ కాబట్టి, ప్రస్తుతానికి మామ్స్‌ బిలీఫ్‌లో సభ్యులుగా ఉన్న వారికే ఈ పాలసీ అందుబాటులో ఉంటుంది. రూ.1.5లక్షల పాలసీకి రూ.22వేల వరకూ ప్రీమియం ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని