‘ఏఐఎస్‌’ చూశారా?

గత ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయం, చేసిన అధిక విలువైన ఖర్చుల వివరాలతో ‘వార్షిక సమాచార నివేదిక’ (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌- ఏఐఎస్‌)ను ఆదాయపు పన్ను విభాగం సిద్ధం చేసింది.

Updated : 29 Apr 2022 05:46 IST

గత ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయం, చేసిన అధిక విలువైన ఖర్చుల వివరాలతో ‘వార్షిక సమాచార నివేదిక’ (యాన్యువల్‌ ఇన్ఫర్మేషన్‌ స్టేట్‌మెంట్‌- ఏఐఎస్‌)ను ఆదాయపు పన్ను విభాగం సిద్ధం చేసింది. దీన్ని మీరు ఇన్‌కంట్యాక్స్‌ వెబ్‌సైటులోకి లాగిన్‌ అయి, సర్వీసెస్‌ ట్యాబ్‌లో చూడొచ్చు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో మీకు వచ్చిన ఆదాయం, మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌/టీసీఎస్‌)లావాదేవీలతో సహా అన్నీ ఈ నివేదికలో ఉంటాయి. కాబట్టి, ఒకసారి మీ ఏఐఎస్‌ను పరిశీలించండి. అందులో ఉన్న ఆదాయ, వ్యయాలన్నింటికీ ఆధారాలు మీ దగ్గర ఉండేలా చూసుకోండి.

* పొదుపు ఖాతా, టర్మ్‌ డిపాజిట్లు, రికరింగ్‌ డిపాజిట్లు ఇతర ఖాతాల నుంచి వచ్చిన వడ్డీ

* కంపెనీల నుంచి వచ్చిన డివిడెండ్లు

* అంతకు క్రితం ఆదాయపు పన్ను రిఫండ్‌పై వచ్చిన వడ్డీ

* లాటరీల ద్వారా వచ్చిన బహుమతులు

* ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల నుంచి వచ్చిన ఆదాయం

* వ్యవధి తీరిన ఎన్‌ఎస్‌సీల నుంచి వచ్చిన మొత్తం

* మ్యూచువల్‌ ఫండ్ల యూనిట్లను విక్రయించినప్పుడు వచ్చిన లాభం

* పొదుపు ఖాతాలో చేసిన భారీ నగదు డిపాజిట్లు

* స్థిరాస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాల్లాంటివి ఇందులో ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని