వ‌డ్డీ రేట్లు పెరుగుతాయ‌ని గృహ రుణాలు తొంద‌ర‌ప‌డి చెల్లిస్తున్నారా?

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వ‌డ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో, ఈఎమ్ఐలు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని రుణాల‌ను తొంద‌ర‌ప‌డి ముందే చెల్లిస్తున్నారా? ఒక్క‌సారి ఆలోచించండి. గృహ రుణాల‌పై వ‌డ్డీకి ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయ‌న్న

Published : 19 Dec 2020 21:04 IST

రిజ‌ర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) వ‌డ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి. దీనితో, ఈఎమ్ఐలు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని రుణాల‌ను తొంద‌ర‌ప‌డి ముందే చెల్లిస్తున్నారా? ఒక్క‌సారి ఆలోచించండి. గృహ రుణాల‌పై వ‌డ్డీకి ప‌న్ను మిన‌హాయింపులు ఉంటాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందుకే రుణాన్ని కొన‌సాగిస్తేనే కొంత డ‌బ్బు ఆదా అవుతుంది. ఒకవేళ మీ వ‌ద్ద స‌రిప‌డినంత డ‌బ్బు ఉండి ఇత‌ర ఏ అవ‌స‌రాలు లేకుంటే పాక్షికంగా లేదా మొత్తం ఒకేసారి చెల్లించుకోవ‌చ్చు. కానీ, డ‌బ్బు లేన‌ప్పుడు రుణాన్ని కొన‌సాగించ‌డమే మంచిది. ఒకేసారి ఎక్కువ వ‌డ్డీతో్ చెల్లించ‌డం కంటే ఈఎమ్ఐల‌ను పెంచుకొని రుణాన్ని చెల్లిస్తుండాలి.

గృహ రుణానికి చెల్లిస్తున్న వ‌డ్డీల‌పై ఆదాయ ప‌న్ను చ‌ట్టం 1961, సెక్ష‌న్ 24(బీ) ప్ర‌కారం రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను త‌గ్గింపు పొంద‌వ‌చ్చు. అందుకే రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీకి విలువ చేసేంత రుణాన్ని కొన‌సాగించ‌డం మంచిద‌ని నిపుణుల సూచ‌న‌. ఉదాహ‌ర‌ణ‌కు, మీ రుణ మొత్తం రూ.23 ల‌క్ష‌లు, గ‌డ‌వు మ‌రో ప‌దేళ్లు, వ‌డ్డీ రేటు 9 శాతం ఉంద‌నుకుంటే, అప్పుడు రూ.2 ల‌క్ష‌ల వ‌డ్డీ ప‌డుతుంది. వ‌డ్డీ రేటు 9.50 శాతం ఉంటే రుణ మొత్తం రూ.21.75 ల‌క్ష‌లుగా ఉండాలి. వ‌డ్డీ రేటు ఎక్కువ‌గా ఉంటే రుణం మొత్తం త‌క్కువ‌గా ఉండేలా చూసుకోవాలి. వ‌డ్డీ రేటు పెరిగినా కొద్ది రుణ మొత్తం త‌గ్గుతుండాలి. మీరు అత్య‌ధిక‌ ప‌న్ను శ్లాబులోకి వ‌స్తే, మీ రుణ‌ వ‌డ్డీ రేట్లు 9 శాతం ఉంద‌నుకుంటే ప‌న్ను మిన‌హాయించి 6.2 శాతం మాత్ర‌మే ప‌డుతుంది. ప‌న్ను త‌గ్గింపు ల‌భించిన‌ప్పుడు చెల్లించే రుణ మొత్తం విలువ త‌గ్గుతుంది.

మీరు పెట్టుబ‌డులు పెట్టిన లార్జ్ క్యాప్ ఈక్విటీ ఫండ్ వార్షికంగా 10 శాతం రాబ‌డిని అందిస్తుంద‌నుకుంటే, ఒకేసారి రుణ మొత్తాన్ని చెల్లించ‌డం కంటే పైన తెలిపిన‌ట్లుగా వ‌డ్డీ రేట్ల‌ను 6.2 శాతంగా చెల్లిస్తుండ‌టం మంచిది. చాలా వ‌ర‌కు గృహ రుణాల‌పై వ‌డ్డీ రేట్లు ఎక్కువ‌గానే ఉంటాయి. ఆర్‌బీఐ వ‌డ్డీ రేట్లు పెంచిన త‌ర్వాత ఇవి మ‌రికాస్త పెరిగే అవ‌కాశం ఉంది. అయితే తొంద‌ర‌ప‌డి రుణ మొత్తాన్ని ఒకేసారి చెల్లించ‌క‌పోవ‌డ‌మే మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు