Capital Gains Tax: మూలధన లాభాలపై పన్నులో మార్పులకు ప్రభుత్వం సిద్ధం

మూలధన లాభాలపై పన్ను విషయంలో కొన్ని సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ బుధవారం తెలిపారు......

Published : 09 Feb 2022 17:13 IST

రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌

దిల్లీ: మూలధన లాభాలపై పన్ను విషయంలో కొన్ని సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్‌ బజాజ్‌ బుధవారం తెలిపారు. షేర్లు, డెట్‌, స్థిరాస్తిపై మూలధన లాభాల పన్ను లెక్కించేందుకు ప్రస్తుతం ఉన్న వివిధ రేట్లు, హోల్డింగ్ వ్యవధి వంటి వాటిని మరింత సరళీకరించే అవకాశం ఉందన్నారు. 

ఆదాయ పన్ను నిబంధనల ప్రకారం.. స్థిర, చరాస్తుల విక్రయం ద్వారా వచ్చే లాభాలపై పన్ను విధిస్తారు. కార్లు, ఫర్నీచర్‌ వంటి కొన్ని చరాస్తులపై మాత్రం ఎలాంటి పన్ను ఉండదు. అయితే, ప్రస్తుతం ఉన్న ‘మూలధన లాభాలపై పన్ను’ విధానం సంక్లిష్టంగా ఉందని తరుణ్‌ బజాజ్‌ అభిప్రాయపడ్డారు. అవకాశం ఉన్నప్పుడు సవరణలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు ఎలాంటి విధానాల్ని అవలంబిస్తున్నాయో అధ్యయనం చేయాలని సీఐఐకి విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని