Hyundai i20 N Line: హ్యుందాయ్‌ ఐ20 ఎన్‌ లైన్‌ ఫేస్‌లిఫ్ట్‌.. ధర, ఫీచర్ల వివరాలివే!

Hyundai i20 N Line ఫేస్‌లిఫ్ట్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇందులో భద్రత, డిజైన్‌, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేసినట్లు కంపెనీ తెలిపింది.

Published : 22 Sep 2023 17:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా ఐ20 ఎన్‌ లైన్‌ (Hyundai i20 N Line) ఫేస్‌లిఫ్ట్‌ను లాంచ్‌ చేసింది. దీని ధర రూ.9.99 లక్షల నుంచి రూ.12.32 లక్షలుగా పేర్కొంది. భద్రత, డిజైన్‌, ఫీచర్ల పరంగా ఇందులో కొన్ని మార్పులు చేశారు. ఈ కారును కొత్తగా ఐ20 ఎన్‌ లైన్‌ టర్బో పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. గతంలో ఐ20 మోడల్‌ నుంచి టర్బో ఇంజిన్‌ వేరియంట్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ కారుపై మూడేళ్లు లేదా లక్షన్నర కిలోమీటర్ల ఎక్స్‌టెండెడ్‌ వారెంటీ ఇస్తున్నారు.

హ్యుందాయ్‌ కొత్త ఐ20 ఎన్‌ లైన్‌లో 7-స్పీడ్‌ డీసీటీ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌, 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌ ట్రాన్స్‌మిషన్‌తో 1.0 లీటర్‌ కప్పా టర్బో జీడీఐ పెట్రోల్‌ ఇంజిన్‌ అమర్చారు. ఇది 118 బీహెచ్‌పీ పవర్‌, 172 ఎన్‌ఎమ్‌ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో నార్మల్‌, స్పోర్ట్‌, ఈకో అనే మూడు డ్రైవ్‌ మోడ్స్ ఉన్నాయి. ‘‘ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌ శ్రేణిలో ఎన్నో ఏళ్లుగా ఐ20 సిరీస్‌ను వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు ఐ20 ఎన్‌ లైన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో డిజైన్‌, ఫీచర్ల పరంగా కీలక మార్పులు చేశాం. ముఖ్యంగా యువతను దృష్టిలో ఉంచుకుని కారు లోపలి భాగాలను డిజైన్‌ చేశాం. ఇది తప్పకుండా యువతను ఆకర్షిస్తుంది’’ అని హ్యుందాయ్‌ మోటార్స్ ఇండియా సీవోవో తరుణ్‌ గార్గ్‌ తెలిపారు.

భారత్‌లో ప్రారంభమైన ఐఫోన్ 15 అమ్మకాలు.. లాంచ్‌ ఆఫర్లివే

ఐ20 ఎన్‌ లైన్‌ను భద్రత పరంగా మరింత మెరుగుపరిచినట్లు కంపెనీ తెలిపింది. ప్రయాణికుల భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగులు సహా ఎలక్ట్రానిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌, హిల్‌ అసిస్ట్‌ కంట్రోల్‌, వెహికల్‌ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్‌, యాంటీలాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, ఎలక్ట్రానిక్‌ బ్రేక్‌ డిస్ట్రిబ్యూషన్‌ వంటి ఫీచర్లు ఇస్తున్నారు. ఇంటీరియర్‌ విషయానికొస్తే.. ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్‌ చేశారు. 60 కనెక్ట్‌ ఫీచర్లు, ఓవర్‌ ది ఎయిర్‌ అప్‌డేట్స్‌, మల్టీ లాంగ్వేజ్‌ సపోర్ట్‌, 127 బిల్ట్‌-ఇన్‌ వాయిస్‌ రికగ్నిషన్‌ కమాండ్స్‌,  టైప్‌-సి ఛార్జర్‌, ఏడు స్పీకర్లతో బాస్‌ సౌండ్‌ సిస్టమ్‌ వంటి సదుపాయాలున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని