Indigo: ఇండిగో ఘనత.. ఏడాదిలో 10 కోట్ల మంది ప్రయాణికులు

Indigo: ఇండిగో సంస్థ అరుదైన ఘనత సాధించింది. ఒక్క ఏడాదిలో 10 కోట్ల మందిని తమ గమ్యస్థానాలకు చేర్చింది.

Published : 18 Dec 2023 22:07 IST

Indigo | ముంబయి: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో (Indigo) అరుదైన ఘనత సాధించింది. ఒక్క ఏడాది (క్యాలెండర్‌)లో 10 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసింది. ఈ ఫీట్‌ సాధించిన తొలి దేశీయ విమానయాన సంస్థగా గుర్తింపు పొందింది. ఈ ఏడాదే 17వ వసంతాన్ని పూర్తి చేసుకున్న ఇండిగో సంస్థ.. తక్కువ కాలంలో ఈ ఘనత సాధించిన విమాయాన సంస్థగా నిలిచింది. 

ఈ అరుదైన ఘనతతో ట్రాఫిక్‌ పరంగా ప్రపంచంలోనే టాప్‌-10 ఎయిర్‌లైన్‌ సంస్థల జాబితాలో చేరినట్లు ఇండిగో ఓ ప్రకటనలో తెలిపింది. 2022 క్యాలెండర్‌ సంవత్సరంలో 7.8 కోట్ల మంది ఇండిగో విమానాల్లో ప్రయాణించారు. ఏడాదిలో 22 శాతం మంది ప్రయాణికులు పెరిగారు. ఒకే రోజు 2 వేల విమానాలు, 118 గమ్యస్థానాలు చేర్చిన ఘనత కూడా ఇండిగో సొంతమైంది. ఇందులో 32 అంతర్జాతీయ గమ్యస్థానాలు కూడా ఉన్నాయి. ఈ మైలురాయిని అందుకోవడం చాలా సంతోషంగా ఉందని ఇండిగో చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ పీటర్‌ ఎల్బెర్స్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు