Nokia: నోకియా ఫీచర్‌ ఫోన్లలోనూ ఇకపై యూట్యూబ్‌ షార్ట్స్‌

Nokia: ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీ నోకియా 4జీకి సపోర్ట్‌ చేస్తూ రెండు కొత్త ఫీచర్ ఫోన్లను భారత్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే ఈ ఫోన్లలో కొత్త ఫీచర్లను జోడించింది.

Published : 14 Dec 2023 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నోకియా ఈ ఏడాదిలో కొత్తగా తీసుకొచ్చిన నోకియా 110 4జీ (Nokia 110 4G), నోకియా 106 4జీ (Nokia 106 4G) ఫోన్లకు కొత్త ఫీచర్లను జోడించింది. యూపీఐ ఫీచర్‌తో, 4జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్‌ చేసే వీటిలో యూట్యూబ్ షార్ట్స్‌ యాక్సెస్ చేసే సదుపాయాన్ని తీసుకొచ్చింది. వీటితో పాటు అనేక క్లౌడ్ అప్లికేషన్లు వినియోగించేందుకు అవకాశం కల్పించింది.

ఈ రెండు ఫీచర్‌ ఫోన్లు వినియోగించే యూజర్లు ఇకపై యూట్యూబ్‌ షార్ట్స్‌ని వినియోగించుకోవచ్చని నోకియా పేరుతో హ్యాండ్‌సెట్లు తయారుచేసే హెచ్‌ఎండీ బుధవారం ప్రకటించింది. క్లౌడ్ అప్లికేషన్లకు వినియోగించుకొనే సదుపాయాన్ని తీసుకొచ్చినట్లు ప్రకటించింది. ఈ అప్లికేషన్లతో వార్తలు, వాతావరణ అప్‌డేట్లు, క్రికెట్ స్కోర్‌లను కూడా పొందొచ్చని కంపెనీ పేర్కొంది. ఆయా ఫీచర్‌ ఫోన్లలో క్లౌడ్ సింబల్‌పై క్లిక్‌ చేసి గూగుల్ ఐడీ ద్వారా సైన్‌-ఇన్‌ అయితే చాలు ఈ కొత్త ఫీచర్లను యాక్సెస్‌ చేయొచ్చు.

యూపీఐతో క్రెడిట్‌ కార్డు జత చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే..!

Nokia 106 4జీ ధర ప్రస్తుతం రూ.2,199గా ఉంది. 1.8-అంగుళాల క్యూవీజీఏ డిస్‌ప్లే ఇందులో ఉంది. ఎంపీ3 ప్లేయర్‌తో తీసుకొచ్చిన ఈఫోన్‌ 1,450mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక సారి ఛార్జ్‌ చేస్తే ఎనిమిది గంటల పాటు ఉంటుంది. నోకియా 110 4జీ ఫోన్‌ ప్రస్తుత ధర రూ.2,399 గా ఉంది. ఈ ఫోన్‌లో నోకియా 106 4జీ తరహా ఫీచర్లే ఉన్నాయి. దుమ్మూ, నీరు లోనికి ప్రవేశించకుండా IP52 రేటింగ్‌తో వచ్చింది. వైర్‌లెస్‌ ఎఫ్‌ఎం కనెక్షన్‌తో పాటు యూపీఐ ఫీచర్‌ ఈ ఫోన్లలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని