Prepaid Plans: ప్రతినెలా ఒకేరోజు రీఛార్జి చేసుకోవాలా.. అయితే, ఈ ప్లాన్‌లను చూడండి!

మరి వివిధ సంస్థలు అందిస్తున్న నెలరోజుల కాలావవధి పథకాలేంటో చూద్దాం...

Updated : 14 Jun 2022 15:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రీపెయిడ్‌ చందాదార్లకు తప్పనిసరిగా నెల రోజుల కాలావధి పథకాలను టెలికాం నెట్‌వర్క్‌ సంస్థలు అందుబాటులోకి తేవాలని టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇటీవల ఆదేశించింది. దీంతో దాదాపు అన్ని కంపెనీలు 30 లేదా 31 రోజుల వ్యాలిడిటీతో కూడిన ప్రీపెయిడ్‌ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఇందువల్ల ఏడాదికాలంలో చేసుకోవాల్సిన రీఛార్జుల సంఖ్య తగ్గుతుంది. 28 రోజుల కాలావధి పథకాల వల్ల ఏడాది కాలానికి 13 సార్లు రీఛార్జి చేయాల్సి వస్తోంది. ఇకపై 12 సరిపోతాయి. మరి వివిధ సంస్థలు అందిస్తున్న నెలరోజుల కాలావధి పథకాలేంటో చూద్దాం...

జియో రూ.259 ప్లాన్‌...

రూ.259తో రీఛార్జి చేస్తే 1.5 జీబీ డేటాతో పాటు అపరిమిత కాల్స్‌ సహా ఇతర ప్రయోజనాలను జియో అందిస్తోంది. నెలలో ఉండే రోజులతో (30 లేదా 31) నిమిత్తం ఉండదు. ప్రతినెలా ఒకే తేదీన రీఛార్జి చేయాల్సి ఉంటుంది. అన్ని ప్లాన్ల తరహాలోనే దీన్ని కూడా ఒకేసారి అనేక రీఛార్జులు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈ ప్లాన్‌ జియో వినియోగదారులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ మాధ్యమంలో అందుబాటులో ఉంది.

అలాగే జియోలో నెల రోజుల వ్యాలిడిటీతో రూ.296 ప్లాన్‌ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌లో ఒకేసారి 25 జీబీ డేటా లభిస్తోంది. అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ రెండు ప్లాన్లలో జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్‌, జియో సెక్యూరిటీ సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది.

ఎయిర్‌టెల్‌లో రూ.319 ప్లాన్‌..

భారతీ ఎయిర్‌టెల్‌ నెలరోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను రూ.319 అందజేస్తోంది. రోజుకి 2 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌ ఉంటాయి. వింక్‌ మ్యూజిక్‌, అపోలో 24/7 సర్కిల్‌ వంటి ఎయిర్‌టెల్‌ థ్యాంక్స్‌ ప్రయోజనాలు ఉన్నాయి. దీంతో పాటు జియో తరహాలోనే రూ.296 ప్లాన్‌ను కూడా ఎయిర్‌టెల్‌ అందిస్తోంది. 

వొడాఫోన్‌ ఐడియాలో మూడు ప్లాన్‌లు..

* నెలకాలావధితో వొడాఫోన్‌ ఐడియా మూడు ప్లాన్‌లను అందిస్తోంది. రూ.195 ప్లాన్‌లో కేవలం 2 జీబీ డేటా మాత్రమే లభిస్తోంది. అపరిమిత వాయిస్‌కాలింగ్‌, 300 ఎస్‌ఎంఎస్‌లు కూడా ఉంటాయి. 

* మరో ప్లాన్‌ రూ.319కు అందుబాటులో ఉంది. దీంట్లో రోజుకి 2 జీబీ డేటా అందుతోంది. అపరిమిత వాయిస్‌కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లతో పాటు వీఐ మూవీస్‌, టీవీ సబ్‌స్క్రిప్షన్‌ వంటి వీఐ హీరో అపరిమిత ప్రయోజనాలు అందనున్నాయి. 

* రూ.337 ప్లాన్‌తోనూ వీఐ నెలరోజుల వ్యాలిడిటీని ఇస్తోంది. దీంట్లో ఒకేసారి 28 జీబీ డేటా వస్తుంది. అపరమిత వాయిస్‌కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, వీఐ మూవీస్‌, టీవీ క్లాసిక్‌కు ఉచిత అనుమతి లభిస్తుంది. డేటా వినియోగంపై రోజువారీ పరిమితి ఉండదు.

బీఎస్‌ఎన్‌ఎల్‌లోనూ మూడు ప్లాన్‌లు..

* బీఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రత్యేకంగా నెలరోజుల కాలావధి పథకాలేమీ లేవు. అయితే, 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌లను మాత్రం అందిస్తోంది. బేసిక్‌ ప్లాన్‌ రూ.147 అందుబాటులో ఉంది. దీంట్లో 10 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాలింగ్‌, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌ వంటి ప్రయోజనాలను పొందొచ్చు.

* రూ.247కు కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌లో 30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను పొందొచ్చు. దీంట్లో ఒకేసారి 50 జీబీ డేటా లభిస్తుంది. రూ.10 మెయిన్‌ టాక్‌టైం, అపరిమిత వాయిస్‌ కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు, బీఎస్‌ఎన్‌ఎల్‌ ట్యూన్స్‌, ఈరోస్‌నౌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సర్వీసెస్‌ వంటి ప్రయోజనాలు ఉన్నాయి.

* చివరగా బీఎస్‌ఎన్‌లో 30 రోజుల వ్యాలిడిటీతో వస్తోన్న ప్లాన్‌ రూ.299కి అందుబాటులో ఉంది. దీంతో యూజర్లకు రోజూ 3జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌కాలింగ్‌, రోజుకి 100 ఎస్‌ఎంఎస్‌లు ఉంటాయి.

ఈ ప్లాన్లతో ప్రతినెలా ఒకే తేదీన తిరిగి రీఛార్జి చేసుకునే వెసులుబాటు ఉంది. అంటే మార్చి 5న తొలి రీఛార్జి చేస్తే తిరిగి ఏప్రిల్‌ 5, మే 5, జూన్‌ 5.. అలా ప్రతినెలా ఐదో తేదీన రీఛార్జి చేసుకోవాలి. దీనికి బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం మినహాయింపు. దీంట్లో కేవలం 30 రోజుల వ్యాలిడిటీతో మాత్రమే ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. అంటే 31 రోజులు ఉన్న నెలలో ఒకరోజు ముందుగానే రీఛార్జి చేసుకోవాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని