ప్యాసెంజర్ వాహనాల రిటైల్ విక్రయాల్లో 24% వృద్ధి
డిసెంబరులో ప్యాసెంజర్ వాహనాల రిటైల్ విక్రయాల్లో 23.99 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ)’ వెల్లడించింది. 2019 డిసెంబరులో...
దిల్లీ: డిసెంబరులో ప్యాసెంజర్ వాహనాల రిటైల్ విక్రయాల్లో 23.99 శాతం వృద్ధి నమోదైనట్లు ‘ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్(ఎఫ్ఏడీఏ)’ వెల్లడించింది. 2019 డిసెంబరులో 2,18,775 యూనిట్ల అమ్మకాలు జరగ్గా.. ఈ డిసెంబరులో అవి 2,71,249కి పెరిగాయి. ద్విచక్రవాహనాల విక్రయాలు 2019, డిసెంబరులో 12,73,318 అమ్ముడయ్యాయి. ఈసారి అవి 11.88 శాతం పెరిగి 14,24,620 యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇక వాణిజ్య వాహన విక్రయాలు ఈసారి తగ్గాయి. 2019 డిసెంబరులో 59,497 వాహనాలు అమ్ముడుకాగా.. ఈసారి అవి 13.52 శాతం తగ్గి 51,454 యూనిట్లకు పరిమితమైంది. ఇక త్రీవీలల్ విక్రయాలు సైతం 52.75 శాతం కుంగాయి. ట్రాక్టర్ అమ్మకాలు 35.49 శాతం పెరిగాయి. స్థూలంగా అన్ని విభాగాల్లో కలిపి డిసెంబరులో వాహన విక్రయాలు 11.01 శాతం పెరిగాయి. 2019, డిసెంబరులో 16,61,245 యూనిట్లు విక్రయించగా.. ఈ డిసెంబరులో ఆ సంఖ్య 18,44,143కు ఎగబాకింది.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
ఎండలిలా.. ప్రచారమెలా..!: ప్రజలను కలిసేందుకు నేతల రకరకాల యత్నాలు
-
బకాయిలు కట్టకపోతే కరెంట్ కట్!.. ఉద్యోగులకు ప్రభుత్వం హెచ్చరిక
-
రివ్యూ: శబరి.. వరలక్ష్మీ శరతకుమార్ నటించిన థ్రిల్లర్ ఎలా ఉంది?
-
ఐదేళ్లలో ఉద్యోగులపై 1500కుపైగా కేసులు
-
ఏడాది పొడవునా బీఈడీ ప్రవేశాలా?ఉన్నత విద్యామండలిపై వెల్లువెత్తుతున్న విమర్శలు