మ్యూచువ‌ల్ ఫండ్లతో ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌

సెల‌వు రోజు, పుట్టిన రోజు లేదా ఏ ఇత‌ర సంద‌ర్భాల‌కైనా ముందుగా ప్ర‌ణాళిక చేసుకోవ‌డం అవ‌స‌రం. మ‌రి ప్ర‌తీ చిన్న‌దానికి ఒక ప్ర‌ణాళిక వేసుకునేవారు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక గురించి కూడా ఆలోచించాలి క‌దా........

Published : 17 Dec 2020 15:32 IST

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్ప‌రుచుకునేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డులు దోహ‌ద‌ప‌డ‌తాయి

సెల‌వు రోజు, పుట్టిన రోజు లేదా ఏ ఇత‌ర సంద‌ర్భాల‌కైనా ముందుగా ప్ర‌ణాళిక చేసుకోవ‌డం అవ‌స‌రం. మ‌రి ప్ర‌తీ చిన్న‌దానికి ఒక ప్ర‌ణాళిక వేసుకునేవారు ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక గురించి కూడా ఆలోచించాలి క‌దా. మీకు నిరంత‌ర ఆదాయం వ‌స్తున్నంత వ‌ర‌కు పెద్ద‌గా ఆర్థిక‌ ఇబ్బందులు ఉండ‌క‌పోవ‌చ్చు. అయితే ప‌ద‌వీ విర‌మణ త‌ర్వాత ఒక్క‌సారిగా ఆదాయం రావ‌డం ఆగిపోతుంది. ఖ‌ర్చులు పెరుగుతాయి. మ‌రి అప్పుడు ఏం చేయాలి. దానికి త‌గిన ప్ర‌ణాళిక వేసుకొని త‌గినట్లుగా పెట్టుబ‌డులు ప్రారంభించాలి. ఉద్యోగంలో చేరిన మొద‌టి రోజు నుంచే ప‌ద‌వీ విర‌మ‌ణ నిధి గురించి ఆలోచించాలి. అలా అయితేనే మీరు ఆ వ‌య‌స్సులో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాధార‌ణ జీవితం గ‌డుపుతారు. త‌క్కువ మొత్తంతో ప్రారంభించి, ఆదాయం పెరిగినా కొద్ది పెట్టుబ‌డిని పెంచుతూ పోవాలి. ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు ఎలా చేసుకోవాలి చూద్దాం…

మ్యూచువ‌ల్ ఫండ్స్‌:

మ్యూచువ‌ల్ ఫండ్లలో న‌చ్చిన స్కీమ్‌ను ఎంచుకొని పెట్టుబ‌డులు పెట్టే స‌దుపాయం ఉంటుంది. మీ ఆర్థిక ల‌క్ష్యాల‌కు త‌గిన‌ట్లుగా స్కీమ్‌ను ఎంచుకొని పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు. చిన్న వ‌య‌స్సులోనే మ్యూచువ‌ల్ ఫండ్లలో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే, దీర్ఘ‌కాలంలో ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని సులభంగా పొంద‌వ‌చ్చు. డెట్ ఫండ్ల‌తో పోలిస్తే ఈక్విటీ మార్కెట్ల‌లో రిస్క్ ఎక్కువ‌గా ఉంటుంది.

అప్పుడే ఉద్యోగంలో చేరినవారు న‌ష్ట‌భ‌యాన్ని త‌ట్టుకునేవారు ఇందులో పెట్టుబ‌డుల‌కు మొగ్గుచూపుతారు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఎక్కువ కాలం లేన‌ప్పుడు, రిస్క్ తీసుకోలేనివారు డెట్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డం మంచింది. అయితే పెట్టుబ‌డుల‌కు బంగారం కూడా ఒక మంచి సాధ‌నం. పోర్ట్‌ఫోలియోలో క‌చ్చితంగా 10 నుంచి 15 శాతం పెట్టుబ‌డుల‌ను ప‌సిడి పెట్టుబ‌డులు ఉండేలా చూసుకోవాలి.

పెట్టుబ‌డులు ఎలా చేయాలి?

ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్పాటు చేసుకునేందుకు క్ర‌మానుగ‌త పెట్టుబ‌డుల విధానం (సిప్) ఒక మంచి మార్గం. సిప్‌లో రూ.500 నుంచి ఎంతైనా నెల‌వారిగా పెట్టుబ‌డులు చేయ‌వ‌చ్చు. సిప్ ద్వారా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అల‌వాటుగా మారుతుంది. నిధి నిర్వ‌హ‌ణ నైపుణ్యాలు కూడా పెరుగుతాయి.

ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌కు కోసం ముఖ్యంగా పాటించ‌వ‌ల‌స‌ని మూడు అంశాలు .

  1. సిప్:

క్ర‌మానుగుత పెట్టుబ‌డుల విధానంలో (సిప్) త‌క్కువ మొత్తం పెట్టుబ‌డితో, ఎలాంటి అధిక ఒత్తిడి లేకుండా ప‌ద‌వీ విర‌మ‌ణ నిధిని ఏర్ప‌రుచుకునేందుకు మంచి మార్గం.

  1. పెట్టుబ‌డుల సామ‌ర్థ్యం

ఒక యువ పెట్టుబ‌డిదారుడికి ఎక్కువ రిస్క్ తీసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అందుకే ఈక్విటీల‌లో పెట్టుబ‌డులు చేయ‌డం మంచింది. అయితే ప‌ద‌వీ విర‌మ‌ణ‌కు ఇంక కొంత కాల‌మే ఉంద‌నుకున్న‌ప్పుడు మీ పెట్టుబ‌డులను డెట్ ఫండ్ల‌లోకి మార్చాలి. సిస్ట‌మేటిక్ ట్రాన్స్‌ఫ‌ర్ ప్లాన్ (ఎస్‌టీపీ0 క్ర‌మానుగ‌తంగా మీ పెట్టుబ‌డుల‌ను ఈక్విటీ నుంచి డెట్ ఫండ్ల‌లోకి మారుస్తుంది.

  1. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత కూడా ఆదాయం

మ్యూచువ‌ల్ ఫండ్లు మీకు అవ‌స‌ర‌మైన‌ప్పుడు యూనిట్లు లేదా డ‌బ్బు రూపంలో విత్‌డ్రా చేసుకునే అవ‌కాశాన్ని క‌ల్పించింది. దీంతో ప‌ద‌వీవిర‌మ‌ణ త‌ర్వాత కూడా , ఎలాంటి ఆటంకం లేకుండా ఎప్ప‌టిలాగే ఆదాయం పొందే అవ‌కాశం ఉంటుంది. అందుకే ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత అవ‌స‌ర‌మ‌య్యే నిధి కోసం త‌గిన ప్ర‌ణాళిక‌ను ఎంచుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని