ఏస్బీఐ ఇన్ టచ్ శాఖల ఉపయోగాలను తెలుసుకోండి

బ్యాంకు ఖాతా కేవలం వేతన జీవులు మాత్రమే తెరవడం కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరికి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుత రోజుల్లో యువత వారి పాకెట్ మనీని దాచుకోడానికి లేదా పెట్టుబడి ప్రయోజనం కోసం బ్యాంకు ఖాతాను తెరవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బీమా, బాండ్లు, మరిన్ని పెట్టుబడులను..

Published : 17 Dec 2020 15:34 IST

బ్యాంకు ఖాతా కేవలం వేతన జీవులు మాత్రమే తెరవడం కాకుండా దేశంలోని ప్రతి ఒక్కరికి ఉండడం చాలా ముఖ్యమైన విషయం. ప్రస్తుత రోజుల్లో యువత వారి పాకెట్ మనీని దాచుకోడానికి లేదా పెట్టుబడి ప్రయోజనం కోసం బ్యాంకు ఖాతాను తెరవడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఫిక్స్డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ, బీమా, బాండ్లు, మరిన్ని పెట్టుబడులను ప్రారంభించటానికి బ్యాంకు ఖాతా తెరవడం తప్పనిసరి. దీని వలన చేతిలో నగదు కలిగిన వ్యక్తులు సులభంగా ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా తెరవడానికి ప్రజలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో, దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ-రంగ బ్యాంకు ఏస్బీఐ ట్విట్టర్ ద్వారా కొత్త ఏస్బీఐ ఇన్ టచ్ శాఖల గురించి ప్రచారం చేస్తుంది, ఇది బ్యాంకు ఖాతా తెరిచే ప్రక్రియను చాలా సులభంగా, సరళంగా చేస్తుంది. ఏస్బీఐ ఇన్ టచ్ ద్వారా కేవలం ఒక్క బ్యాంకు ఖాతాను తెరవడం మాత్రమే కాకుండా, డెబిట్ కార్డును పొందడానికి, రుణ దరఖాస్తు, డిపాజిట్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది.

బ్యాంకు ఖాతాను తెరవాలనుకుంటున్న వినియోగదారులు నేరుగా ఏస్బీఐ ఇన్ టచ్ శాఖను సందర్శించి వారి కేవైసీ పత్రాలను సమర్పించి ఖాతాను తెరవడంతో పాటు, ఫొటో డెబిట్ కార్డ్ ను కూడా నిమిషాల వ్యవధిలో పొందవచ్చునని ఏస్బీఐ తెలిపింది.

మీరు ఏస్బీఐ ఇన్ టచ్ సేవలను పొందాలనుకుంటే, కింద తెలియచేసిన వాస్తవాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది.

ఖాతాను తెరవడం

ఏస్బీఐ ఇన్ టచ్ శాఖలలో బ్యాంక్ పొదుపు ఖాతాను తెరవడం, కరెంట్ అక్కౌంట్స్, సీఎస్పీ / డీఎస్పీ అకౌంట్స్, పెహ్లా కదం, పీపీఎఫ్ మొదలైన బ్యాంకింగ్ సేవలను పొందవచ్చు. ఈ శాఖల్లో ఉండే ఖాతాను తెరిచే కియోస్క్ (ఏఓకే) ఖాతాదారులకు వారి ఖాతాను తెరిచేందుకు వీలు కల్పిస్తుంది.

డెబిట్ కార్డ్ ప్రింటింగ్

అప్పటికప్పుడే ఫొటో డెబిట్ కార్డుల ముద్రణ సరికొత్త టచ్ సాంకేతిక డెబిట్ కార్డ్ ప్రింటింగ్ కియోస్క్స్ (డిసిపికె) ద్వారా లభిస్తుంది . బ్యాంకు ఖాతా తెరవడం, డెబిట్ కార్డును ప్రింట్ చేసే మొత్తం ప్రక్రియ కేవలం 15 నిమిషాల కంటే తక్కువ సమయంలో పూర్తవడం విశేషం.

డిపాజిట్లు

ఎలక్ట్రానిక్ చెక్ డిపాజిట్ మెషిన్ ద్వారా చెక్కు డిపాజిట్లు, ఈ -టిడీఆర్, ఈ -ఎస్టీడీఆర్, ఈ -ఏస్బీఐ ఫ్లెక్సీ, ఈ -టాక్స్ సేవింగ్ వంటి డిపాజిట్లు అందుబాటులో ఉన్నాయి. నగదు డిపాజిట్ చేయడానికి నగదు డిపాజిట్ మెషిన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

రుణాలు

వివిధ రకాల రుణాలైన హౌసింగ్, కారు, విద్య, వ్యక్తిగత రుణాలు కూడా ఈ ఏస్బీఐ ఇన్ టచ్ శాఖలలో అందుబాటులో ఉన్నాయి.

ఆర్ధిక సూచనలు

హై-డెఫినిషన్ ఆడియో, వీడియో కాన్ఫరెన్సింగ్ సేవల ద్వారా ఎంపిక చేసిన శాఖలలో నిపుణుల సహాయంతో ఆర్ధిక సలహాలను పొందవచ్చు, ఇక్కడ వినియోగదారులు ఆర్థిక నిపుణులతో నేరుగా సంప్రదించవచ్చు. దీని కోసం రిమోట్ ఎక్స్పర్ట్ మాడ్యూల్ అని పిలిచే టెక్నాలజీని వినియోగిస్తున్నారు.

వేగంగా ముద్రించే ఫొటో డెబిట్ కార్డు

ఏస్బీఐ ఇన్ టచ్ శాఖలు అకౌంట్ నెంబర్, పాన్ ఇండియా కలిగివున్న ఎస్బిఐ కస్టమర్లకు 5 నిమిషాల్లో ఫొటోతో సహా డెబిట్ కార్డులను అందించే సరికొత్త సేవను ప్రారంభించాయి. ఖాతాదారులు కేవలం తమవెంట ఆధార్ కార్డులను తెచ్చుకుని, వాటిని ఏస్బీఐ ఇన్ టచ్ శాఖలో ధృవీకరించుకుని అనంతరం ఫొటో డెబిట్ కార్డులను పొందవలసి ఉంటుంది. వినియోగదారులు తమ డెబిట్ కార్డులను కోల్పోయినప్పుడు లేదా కొత్త కార్డు పొందాలనుకునే వారు కూడా ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.

దేశం మొత్తం మీద 143 కంటే ఎక్కువ జిల్లాలను ఈ ఏస్బీఐ ఇన్ టచ్ శాఖలు కవర్ చేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని