Unemployment: భారత్‌లో తగ్గుతున్న నిరుద్యోగం

దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కొద్దీ నిరుద్యోగ రేటు తగ్గుతోందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ తెలిపింది. ఫిబ్రవరిలో 8.10 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మార్చి నాటికి 7.6 శాతానికి తగ్గిందని పేర్కొంది....

Published : 03 Apr 2022 18:52 IST

కోల్‌కతా: దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్న కొద్దీ నిరుద్యోగ రేటు తగ్గుతోందని ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ (CMIE)’ తెలిపింది. ఫిబ్రవరిలో 8.10 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు మార్చి నాటికి 7.6 శాతానికి తగ్గిందని పేర్కొంది. ఏప్రిల్‌ 2 నాటికి అది మరింత తగ్గి 7.2 శాతానికి పడిపోయిందని వెల్లడించింది. పట్టణ నిరుద్యోగ రేటు 8.5 శాతంగా.. గ్రామీణ రేటు 7.1 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

నిరుద్యోగ రేటు పడిపోతున్నప్పటికీ.. భారత్‌ వంటి పేద దేశంలో ఈ స్థాయిలో ఉండడం కూడా ఆందోళన కలిగించే విషయమని ‘ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌’ విశ్రాంత ఆచార్యుడు అభిరూప్‌ సర్కార్‌ తెలిపారు. ఉపాధి లేకుండా గ్రామీణ ప్రాంతాల్లో జీవనం దుర్భరంగా మారుతుందన్నారు. నిరుద్యోగ రేటు పడిపోవడం.. రెండేళ్ల కొవిడ్‌ సంక్షోభం నుంచి ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడాన్ని సూచిస్తోందని పేర్కొన్నారు.

సీఎంఐఈ గణాంకాల ప్రకారం.. మార్చిలో అత్యధికంగా హరియాణాలో 26.7 శాతం తర్వాత రాజస్థాన్‌, జమ్మూ కశ్మీర్‌లో నిరుద్యోగం 25 శాతంగా ఉంది. బిహార్‌ 14.4 శాతం, త్రిపుర 14.1 శాతం, పశ్చిమ బెంగాల్‌ 5.6 శాతంతో తర్వాతి స్థానాలో ఉన్నాయి. అత్యల్పంగా కర్ణాటక, గుజరాత్‌లో 1.8 శాతం నిరుద్యోగ రేటు నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని