ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డులు త‌గ్గిపోతాయా?

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు......

Updated : 22 Dec 2020 15:10 IST

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు.

​​​​​​​బడ్జెట్ 2020 లో ప్రతిపాదించిన కొత్త పన్ను విధానంలో పన్ను రేట్లు త‌గ్గాయి, కానీ ఆదాయ-పన్ను చట్టం, 1961 లోని సెక్ష‌న్ 80 సీ తోపాటు ఇతర పేర్కొన్న విభాగాల ప్రకారం పన్ను మినహాయింపులు పొందకుండా పరిమితం చేస్తుంది. ఈక్విటీ లింక్‌డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్‌) కింద ఏడాదికి రూ.1.5 ల‌క్ష‌ల వ‌ర‌కు ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది. ప్ర‌త్యేకంగా దీనికోసమే చాలామంది ఈ ప‌థకాన్ని ఎంచుకుంటారు. పెట్టుబ‌డితో పాటు ప‌న్ను ఆదా అవుతుండ‌టం ఇందులో ఆక‌ర్ష‌ణీయ‌మైన అంశం. అయితే కొత్త ప‌న్ను విధానంలో ఈ మిన‌హాయింపులు ఏమి లేక‌పోవ‌డంతో పెట్టుబ‌డులు కొన‌సాగిస్తారా, ఇప్ప‌టికే ఉన్న‌వారు కొన‌సాగిస్తారా అనే సందేహం ఏర్ప‌డింది. అయితే పెట్టుబ‌డులు లేక‌పోయినా ప‌న్ను మిన‌హాయింపు ల‌భిస్తుంది కాబ‌ట్టి దాని వైపు మొగ్గుచూప‌డం స‌రైన నిర్ణ‌యం కాదంటున్నారు నిపుణులు. ఇంకా ఈఎల్ఎస్ఎస్‌లో ఎందుకు పెట్టుబ‌డులు పెట్టాలో చెప్పున్నారిలా…

ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్ ప‌థ‌కాలు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను, స్టాక్ మార్కెట్ల రాబ‌డుల‌ను అందిస్తాయి. ఈఎల్ఎస్ఎస్‌లో మొత్తం నిధి నుంచి 80 శాతం నిధిని లార్జ్ కాప్, మిడ్ కాప్‌, స్మాల్ కాప్ ఈక్విటీల‌లో పెట్టుబ‌డి పెడ‌తారు. అందువ‌ల్ల మల్టీ కాప్ ఫండ్ల మాదిరిగానే రాబ‌డులు ఉంటాయి. క‌నీస లాక్ ఇన్ పిరియ‌డ్ 3 సంవ‌త్స‌రాలు. ఇతర ఈక్విటీ ఫండ్లలో లాగా ఇందులో కూడా కనీసం 10 ఏళ్ళు మదుపు చేస్తే మంచి రాబడి పొందే వీలు ఉంటుంది, స్వల్ప కాలం లో నష్ట భయం ఉంటుంది.

ఇక‌ సిప్ ద్వారా ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబ‌డులు ప‌డితే ఎంచుకున్న తేదీన‌ డ‌బ్బు మీ ఖాతా నుంచి సిప్ ఖాతాలో చేరుతుంది. దీంతో క్ర‌మ‌శిక్ష‌ణ అల‌వాటు అవుతుంది. ప్ర‌తి నెల ముందు పెట్టుబ‌డుల‌కు వెళ్లిన తర్వాత మిగ‌తాది ఖ‌ర్చు చేసుకోవ‌చ్చు. ఇదే ఆర్థిక నిపుణుల స‌ల‌హా. అందుకే ఈఎల్ఎస్ఎస్ పెట్టుబ‌డుల‌ను కొన‌సాగించాల్సిందిగా సూచిస్తున్నారు.
మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్ ఉంటుంది కాబ‌ట్టి ఇప్ప‌టికే ప్రారంభిస్తే అది కొన‌సాగించాలి. సిప్ ఆప్ష‌న్ ఉంది కాబ‌ట్టి పెద్ద క‌ష్టంగా కూడా ఉండ‌దు. కొత్త ప‌న్ను విధానం కొత్త‌గా ఉద్యోగాల్లో చేరే యువ‌త‌కు పెట్టుబ‌డుల వైపు ఆక‌ర్షించ‌కుండా ఉంద‌ని కొంద‌రు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా భ‌విష్య‌త్తు అవ‌స‌రాల కోసం పెట్టుబ‌డులు పెట్ట‌డ‌మే మంచిద‌ని నిపుణులు సూచిస్తున్నారు. కాబ‌ట్టి పాత ప‌న్ను విధానంలోనే ప‌న్ను మిన‌హాయింపుల‌ను క్లెయిమ్ చేస్తూ పెట్టుబ‌డులు కొన‌సాగించ‌డం మంచిద‌ని భావిస్తున్నారు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని