Updated : 30 Nov 2020 16:36 IST

అఫ్గాన్‌లో బాంబు దాడి: 31మంది మృతి

గజ్నీ: అఫ్గానిస్థాన్‌లో భారీ ఆత్మాహుతి బాంబు దాడి జరిగింది. గజ్నీ నగరంలో జరిగిన ఈ దాడిలో ఘటనలో 31 మంది మృతి చెందారు. మరో 24 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ దాడి ఘటనను తూర్పు ప్రావిన్స్‌ గవర్నర్‌ వహీదుల్లా జుమాజదా ధ్రువీకరించారు. అఫ్గాన్‌ మీడియా వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. గజనీ నగరంలోని ఓ ప్రజా రక్షణ విభాగానికి సమీపంలో భారీగా పేలుడు పదార్థాలతో ఆత్మాహుతి దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో 31 మంది మరణించగా.. మరో 24 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. హామ్వీ వాహనంలో భారీగా పేలుడు పదార్థాలతో వచ్చి పేలుళ్లకు పాల్పడినట్లు భద్రతా సిబ్బంది వెల్లడించారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఈ దాడికి ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ బాధ్యత వహిస్తున్నట్లు ప్రకటించలేదని భద్రతా సిబ్బంది వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని