బట్టతల విషయం భర్త దాచాడని..

పెళ్లిచూపుల సమయంలో ఒత్తైన జుట్టుతో అందంగా కనిపించిన భర్త పెళ్లి తర్వాత విగ్‌ పెట్టుకున్నాడని తెలిసిన ఓ భార్య అతనిపై ఛీటింగ్‌ కేసు పెట్టిన ఘటన మహారాష్ర్టలోని థానేజిల్లాలో 

Published : 02 Nov 2020 17:33 IST

అతనితో పాటు అత్తింటివాళ్లపై ఛీటింగ్‌ కేసు

ముంబయి : పెళ్లిచూపుల సమయంలో ఒత్తైన జుట్టుతో అందంగా కనిపించిన భర్త పెళ్లి తర్వాత విగ్‌ పెట్టుకున్నాడని తెలిసిన భార్య అతనిపై ఛీటింగ్‌ కేసు పెట్టిన ఘటన మహారాష్ర్టలోని థానే జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు..

థానేకు చెందిన ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ అయిన ఓ మహిళకు ఈ ఏడాది సెప్టెంబరు నెలలో అదే జిల్లాలోని మీరారోడ్‌కు చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. పెళ్లికి ముందు విగ్ పెట్టుకోవడంతో పెళ్లికుమార్తె వారికి ఎలాంటి అనుమానం రాలేదు. అయితే ఆ వ్యక్తి వివాహం జరిగిన మరుసటి రోజే దొరికిపోయాడు. దీన్ని గుర్తించిన భార్య బట్టతల విషయం చెప్పకుండా పెళ్లి చేసినందుకు భర్తను, అత్తింటి వాళ్లను ప్రశ్నించింది. ఇది చాలా చిన్న విషయం అని సర్దుకుపోవాలని వాళ్లు సూచించారు.  

బట్టతల ఉన్నట్లు తెలిస్తే పెళ్లి చేసుకోనని మోసం చేసి భర్త తనను పెళ్లి చేసుకున్నాడని ఆ మహిళ నయా నాగపూర్‌ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పాటు అత్తింటి వాళ్లు అదనపు వరకట్నం కోసం వేధిస్తున్నారని పోలీసుల ఎదుట వాపోయారు. భర్త తనను మానసికంగా, శారీరకంగా హింస్తున్నాడని మహిళ వాళ్లకు వివరించారు. మహిళ చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమె భర్తపై 406, 500 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కేసుకు వ్యతిరేకంగా సదరు వ్యక్తి థానే న్యాయస్థానంలో పిటీషన్‌ దాఖలు చేశారు. స్పందించిన న్యాయస్థానం పోలీసులకు లొంగిపోవాలని అతడిని ఆదేశించింది. 

 


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని