Crime News: అప్పుడే చంపేసేవాడు.. కానీ ఆమె ఏడుపే ఆపింది..!

మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్‌, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి తేవడంతో అఫ్తాబ్‌ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. విచారణలో భాగంగా ఈ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Published : 16 Nov 2022 11:31 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసులో పలు కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. నిందితుడు అఫ్తాబ్(28) అసలు ఆమెను ఓ పదిరోజుల ముందే అడ్డు తొలగించుకోవాలని అనుకున్నాడట. కానీ, శ్రద్ధా రోదించడంతో ఆ రోజుకు ఆమె హత్య పథకం ఆగిపోయిందని పోలీసులు వర్గాలు వెల్లడించాయి. 

మే 18 శ్రద్ధాను అఫ్తాబ్ హత్య చేశాడు. కానీ, దానికి పది రోజుల ముందు కూడా ఒకసారి వారిమధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఆ రోజే అఫ్తాబ్‌ ఆమెను అంతం చేయాలని భావించాడని ఆ వర్గాలు తెలిపాయి. ఆ గొడవ జరుగుతున్నప్పుడే శ్రద్ధా తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఒక దశలో ఆమె కన్నీటి పర్యంతమైంది. అది చూసి అఫ్తాబ్‌ కాస్త సంకోచించాడు. హత్య చేసేందుకు వెనకడుగు వేశాడని దర్యాప్తు వర్గాలు పేర్కొన్నాయి. 

ఇద్దరి మధ్య పెళ్లి గురించి తరచూ గొడవ జరిగేది. అఫ్తాబ్ వేరే అమ్మాయిలతో ఫోన్‌లో మాట్లాడుతున్నాడని శ్రద్ధా అనుమానించేది. తనను మోసం చేస్తున్నాడని ఆమె భావించడంతో వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకునేదని విచారణలో తెలిసింది. ఇదిలా ఉంటే.. విచారణ సమయంలో నిందితుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని ఓ అధికారి వెల్లడించారు. 

మహారాష్ట్రకు చెందిన అఫ్తాబ్‌, శ్రద్ధాలు మూడేళ్లు సహజీవనం చేశారు. పెళ్లి చేసుకోవాలని శ్రద్ధా పదేపదే ఒత్తిడి చేస్తుండటంతో అఫ్తాబ్‌ ఆమెను మే 18న గొంతుకోసి చంపాడు. ఆపై శవాన్ని 35 ముక్కలు చేసి వాటిని ఫ్రిజ్‌లో దాచాడు. 18 రోజులపాటు వాటిని రాత్రివేళల్లో నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి విసిరేశాడు. శ్రద్ధా శరీర భాగాలు ఫ్రిజ్‌లో ఉండగానే.. అఫ్తాబ్‌ ఆన్‌లైన్‌ డేటింగ్‌ యాప్‌లో మరో యువతికి వలవేసి, ఆమెను పలుమార్లు తన అపార్ట్‌మెంట్‌కు రప్పించుకున్నాడని వెల్లడైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు