Hyderabad: ‘గ్యాంగ్’ ‘స్పెషల్ 26’ సినిమాలు చూసి.. సికింద్రాబాద్‌లో భారీ చోరీ
ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు.

హైదరాబాద్: ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెల్లర్స్‌లో పట్ట పగలు దోపిడీకి పాల్పడిన కేసును పోలీసులు ఛేదించారు. చోరీకి పాల్పడిన అంతరాష్ట్ర ముఠాలోని నలుగురు నిందితులను అదుపులోకి తీసుకన్న పోలీసులు వారి నుంచి ఏడు బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ మీడియాకు వెల్లడించారు.
‘‘ఈనెల 27వ తేదీ ఉదయం రద్దీగా ఉండే సికింద్రాబాద్ పాట్ మార్కెట్‌లోని బాలాజీ జ్యూవెలర్స్‌కు ఆరుగురు నిందితులు వచ్చి ఐటీ అధికారులమంటూ సిబ్బందిని ఓ గదిలో బంధించారు. తనిఖీల పేరుతో కార్ఖానాలో ఉన్న 17 బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకుని ఉడాయించారు. నిందితులు ఎలాంటి ఆధారాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో కేసు దర్యాప్తు పోలీసులకు సవాల్‌గా మారింది. మొత్తం సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించగా.. ఆభరణాల దుకాణంలో పనిచేసే వ్యక్తి ఇచ్చిన సమాచారంతో దొంగలు నగరం చేరినట్లు అంచనాకు వచ్చారు. రంజాన్ తర్వాత ఖానాపూర్‌కు చెందిన జాకీర్ అనే వ్యక్తి పనిలో చేరాడు. అతడు ఇచ్చిన సమాచారంతో చోరీకి ఈ ముఠా ప్లాన్ చేసింది. జాకీర్ నుంచి వివరాలు సేకరించిన పోలీసులు.. మహారాష్ట్రలోని ఖానాపూర్ వెళ్లి నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో ఆరుగురు నిందితులను అరెస్టు చేసి, 10 బంగారం బిస్కెట్లు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. నిందితుల కోసం మహారాష్ట్రలో ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. సూర్య నటించిన ' గ్యాంగ్ ' , అక్షయ్ కుమార్ నటించిన 'స్పెషల్ 26' సినిమాలు చూసి చోరికి పథకం వేసినట్టు నిందితులు విచారణలో వెల్లడించారు’’ అని సైబరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Disney+: నెట్‌ఫ్లిక్స్ బాటలో డిస్నీ+.. పాస్వర్డ్ షేరింగ్‌కు చెక్.. ఇండియాలోనూ?
-
Vishal: రూ. 6.5 లక్షలిచ్చా.. సెన్సార్ బోర్డులోనూ అవినీతి.. ఆరోపించిన విశాల్
-
Tragedy: అయ్యో.. కూతురి పెళ్లి కోసం లాకర్లో ₹18లక్షలు దాస్తే... చివరకు..!!
-
Byreddy Rajasekhar reddy: స్కామ్‌లు చేయడం జగన్‌కు అలవాటేమో.. చంద్రబాబుకు కాదు: బైరెడ్డి
-
Kadapa: సచివాలయంలో సర్వేయర్‌పై వైకాపా కార్యకర్త దాడి
-
Jagan-adani: సీఎం జగన్‌తో గౌతమ్ అదానీ భేటీ