Chittoor: అమర్‌ రాజా బ్యాటరీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

చిత్తూరు జిల్లాలోని అమర్‌ రాజా బ్యాటరీ పరిశ్రమలో అగ్నిప్రమాదం సంభవించింది. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపు చేస్తున్నారు.

Updated : 31 Jan 2023 00:06 IST

యాదమర్రి: చిత్తూరు (Chittoor) జిల్లా యాదమర్రి మండలం మోర్దానపల్లెలోని అమర్‌ రాజా బ్యాటరీ (AmarRaja Battery) పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ప్లాంట్‌లోని టీబీడీ ప్లాంట్‌లో మంటలు ఎగసిపడ్డాయి. ఆ సమయంలో ప్లాంట్‌లో దాదాపు 250 మంది కార్మికులు పని చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదం సంభవించిన వెంటనే ప్లాంట్‌లోని కార్మికులను సురక్షితంగా బయటకు పంపినట్లు యాజమాన్యం ప్రకటించింది. 4 అగ్నిమాపక శకటాలు రంగంలోకి దిగాయి. పోలీసులు, రెవెన్యూ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి.. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీశారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. షార్ట్‌ సర్క్యూట్‌ వల్లే ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు