Kadiri: ఫర్నిచర్‌ గోదాంలో భారీ అగ్నిప్రమాదం

శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని అయ్యప్ప నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నిచర్‌ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి.

Updated : 13 Nov 2023 21:27 IST

కదిరి: శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోని అయ్యప్ప నగర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఫర్నిచర్‌ గోదాంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి భారీగా ఎగిసిపడుతున్నాయి. ఫైరింజన్‌ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో.. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. గోదాంలో ఫర్నిచర్‌ దగ్ధం కావడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని