పట్టుచీరల వ్యాపారంతో మోసం

తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్‌ ఉందని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని పలుప్రాంతాల్లో వ్యాపారులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ ఒకటో పోలీస్‌స్టేషన్‌ సీఐ

Published : 19 Mar 2020 07:23 IST

ముద్దిరెడ్డిపల్లి(హిందూపురం అర్బన్‌): తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్‌ ఉందని ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులోని పలుప్రాంతాల్లో వ్యాపారులను నమ్మించి మోసం చేసిన వ్యక్తిని అరెస్టు చేసినట్లు అనంతపురం జిల్లా హిందూపురం పట్టణ ఒకటో పోలీస్‌స్టేషన్‌ సీఐ బాలమద్దిలేటి, ఎస్‌ఐ శేఖర్‌ తెలిపారు. బుధవారం ఠాణాలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో సీఐ, ఎస్‌ఐ వెల్లడించిన వివరాల మేరకు... సికింద్రాబాద్‌లోని మౌలాలి, తిరుమలగిరి, హౌసింగ్‌బోర్డు కాలనీకి చెందిన ఎ.కొండలరావ్‌ తనకు పెద్ద పట్టువస్త్రాల షోరూమ్‌ సికింద్రాబాద్‌లో ఉందని రాష్ట్రంలోని ధర్మవరం, ప్రొద్దుటూరు, ముద్దిరెడ్డిపల్లి, తమిళనాడులోని సేలం, వారణాసి, కోయంబత్తూరులోని పట్టువస్త్రాల వ్యాపారులను నమ్మించి వారి నుంచి లక్షలాది రుపాయల చీరలు తీసుకొని చెక్కులు ఇస్తూ వచ్చాడు. బ్యాంకు ఖాతాలో డబ్బులేక వ్యాపారులు మోసపోయారని పోలీసులు తెలిపారు. 2018లో ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి రూ.25 లక్షల విలువ చేసే పట్టువస్త్రాలు కొని డబ్బు ఇవ్వకుండా ముఖం చాటేశాడన్నారు. బాధిత వ్యాపారులు స్థానిక ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. న్యాయస్థానంలో హాజరు పరుస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని